ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని క్యాంపు కార్యాలయంలో సిక్కు మత పెద్దలు కలుసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌తో పలు అంశాలపై చర్చించారు. ఈ క్రమంలో సిక్కు మత పెద్దల విజ్ఞప్తిపై సీఎం జగన్ సానుకూలంగా స్పందించారు. సిక్కుల కోసం కార్పొరేషన్ ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఒక మైనార్టీ విద్యాసంస్థను పెట్టుకునేందుకు సహాయం అందిస్తామన్నారు.వివిధ సామాజిక వర్గాలకు చెందిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే చర్యల్లో భాగంగా సిక్కులకు అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
నేడు అల్ప పీడనం, బంగాళాఖాతం వైపు కదులుతూ తుపానుగా బలపడనున్న వాయుగుండం, ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు
గురుద్వారాలకు ఆస్తి పన్ను మినహాయింపు విజ్ఞప్తిపై సీఎం జగన్ అంగీకారం తెలిపారు. ఈ క్రమంలో గురుద్వారాలపై ఆస్తి పన్ను తొలగించాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. గురుద్వారాల్లోని పూజారులైన గ్రంధీలకు పూజారులు, పాస్టర్లు, మౌలాలీల మాదిరిగానే ప్రయోజనాలు ఇవ్వనున్నట్టు తెలిపారు. అలాగే గురునానక్ జయంతి రోజైన కార్తీక పౌర్ణమి నాడు సెలవు ప్రకటనపై సీఎం జగన్ అంగీకారం తెలిపారు. వచ్చే మంత్రివర్గ సమావేశంలో దీనికి సంబంధించి తీర్మానం కూడా చేస్తామని స్పష్టం చేశారు.