చిత్తూరు సీతమ్స్ ఇంజనీరింగ్ కాలేజీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. బీటెక్ సెకండ్ ఇయర్ విద్యార్థి రుద్ర కాలేజీ థర్డ్ ఫ్లోర్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. హాస్పిటల్ కు తరలించే లోపు మృతి చెందాడు. సరిగ్గా నాలుగు రోజులక్రితం ఇదే కాలేజీలో నందిని రెడ్డి అనే విద్యార్ధిని కాలేజీ సెకండ్ ఫ్లోర్ నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. తమిళనాడు వేలూరు హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతి చెందింది.
అయితే నవమాసాలు మోసి, 20 ఏళ్ళు పెంచిన తన కన్నా కొడుకు మరొక 2 ఏళ్లలో ఉద్యోగం సాధించి తమ కుటుంబ బాగోగులు చూసుకుంటాడని కలలు కంటున్న సమయంలో ఏదో తెలియని కారణంతో రోజులాగే కాలేజీకి వెళ్లిన కొడుకు మూడో అంతస్తు నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నాడనే విషయం తెలిసి పుట్టెడు దుఃఖంతో ఉన్న కన్న తల్లి, తన కొడుకు మరణానికి కారణం కాలేజీ యాజమాన్యం ఏమో అని అనుమానం వ్యక్తం చేయడం చాలా సార్లు మనం చూశాం.
అలాంటి సమయంలో ఎంతో సంయమనం పాటిస్తూ ఆ తల్లితండ్రులను శాంతింపజేసి వారికి తోడుగా నిలవాల్సిన పోలీసులు ఇలా ప్రవర్తించడం కరెక్ట్ కాదు. ఆ కన్న తల్లి బాధను అర్థం చేసుకోకుండా ఇలా మెట్లు మీద నుంచి తొయ్యడం ఎంత వరకు కరెక్ట్ .. మెట్లు పై నుండి కిందపడి స్పృహ కోల్పోయిన ఆ మహిళను కనీసం లేపే ప్రయత్నం కూడా చేయకుండా చూస్తున్నారు.
Student Dies by Suicide After Jumping from Third Floor
షాకింగ్ వీడియో
రుద్ర కుటుంబ సభ్యులను తోసేసిన సీఐ
సీతమ్స్ కాలేజీలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి రుద్ర కుటుంబ సభ్యుల ఆందోళన
తమ బిడ్డ మృతి చెందాడని కాలేజీ యజమానాన్ని ప్రశ్నించేందుకు వచ్చిన కుటుంబ సభ్యులను బలవంతంగా తోసేసిన చిత్తూరు తాలూకా సీఐ నిత్యబాబు
న్యాయం చేయాలని కోరుతూ… https://t.co/NE0QoijeY1 pic.twitter.com/WMkJoA7h65
— Telugu Feed (@Telugufeedsite) November 4, 2025
బ్రేకింగ్
చిత్తూరు సీతమ్స్ కాలేజీలో ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య
కాలేజీ మూడో అంతస్తు నుంచి దూకిన విద్యార్థి
గత నెల 30న నందినిరెడ్డి అనే విద్యార్థిని కూడా మూడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యాయత్నం
వరుస ఆత్మహత్యాయత్నాల ఘటనలతో విద్యార్థుల్లో భయాందోళనలు https://t.co/p7EOiMmozP
— Telugu Feed (@Telugufeedsite) November 4, 2025
Friendly Policing అని చెప్తూ ఉండే అధికారులు, ప్రభుత్వ పెద్దలు అవి కేవలం మాటలు కాదు అని నిరూపించుకోవాల్సిన సమయం ఇది .తక్షణమే అధికారులు స్పందించి ఆ వీడియోలో కనిపిస్తున్న చిత్తూరు తాలూకా సీఐ నిత్యబాబుపై చర్యలు తీసుకుని ప్రజలకు పోలీసుల పై ఉన్న అపోహలు తొలిగించే విధంగా ఒక సందేశం ఇవ్వాలి అని పలువురు కోరుతున్నారు.