Andhra Pradesh: రుషికొండ కేసులో ఎంపీ రఘురామకు సుప్రీంకోర్టులో షాక్, హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసిన అత్యున్నత ధర్మాసనం
Supreme Court of India (Photo Credit: ANI)

Amaravati, Nov 11: ఏపీలోని రుషికొండ కేసులో ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు సుప్రీంకోర్టులో (Supreme Court) ఎదురు దెబ్బ తగిలింది.రుషికొండ కేసులో (Rushikonda constructions) దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం.. ప్రతి ఇంచు జాగాకు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే ఎలా అని ప్రశ్నించింది. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై తాము జోక్యం చేసుకోబోమని సుప్రీంకోర్టు తెలిపింది.

ఈ మేరకు హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చేవరకూ వేచి చూడాలని పిటిషనర్‌కు స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే పిటిషన్‌ను సుప్రీంకోర్టు డిస్మిస్‌ చేసింది. రుషికొండలో రెండు కిలోమీటర్ల వరకు తవ్వకాలు జరిపారని సుప్రీంకోర్టుకు రఘురామకృష్ణరాజు న్యాయవాది ఫోటోలు ఇవ్వగా, జోక్యం చేసుకునేందుకు అత్యున్నత స్యాయస్థానం ఆసక్తి చూపలేదు. అభివృద్ధి - పర్యావరణం మధ్య సమతుల్యత పాటిస్తూ ముందుకు వెళ్లాలని గతంలోనే సుప్రీంకోర్టు సూచించింది.

రాజీవ్‌ హంతకులను విడుదల చేయాలని సుప్రీం సంచలన ఆదేశాలు, ఆరుగురు దోషులను విడుదల చేయాలని ఉత్తర్వులు జారీ చేసిన అత్యున్నత ధర్మాసనం

ప్రభుత్వ చర్యలపై అభ్యంతరాలుంటే హైకోర్టును ఆశ్రయించాలని పిటీషనర్ ఎంపీ రఘురామ (MP Raghurama)కు సుప్రీం ధర్మాసనం సూచించింది. హైకోర్టు ఇప్పటికే మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినందున అక్కడ విచారణ పూర్తయిన తరువాతే సుప్రీంకోర్టును ఆశ్రయించాలని ధర్మాసనం తెలిపింది. పర్యావరణ అనుమతులను ఉల్లంఘించి రుషికొండపై ఏపీ ప్రభుత్వం (AP Government) నిర్మాణాలు చేపడుతోందంటూ ఎంపీ రఘురామ పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు ఆదేశాలను కూడా పాటించడం లేదన్నారు. రుషికొండపై నిర్మాణాలకు వెంటనే స్టే విధించాలని కోరారు. న్యాయమూర్తులు సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ అభయ్ ఎస్. ఓకా నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారించింది.