Bachula Arjunudu (Photo-Video Grab)

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ, గన్నవరం ఇంచార్జ్ బచ్చుల అర్జునుడు ఈ సాయంత్రం కన్నుమూశారు.గుండెపోటు (Heart Attack) రావడంతో ఆయన జనవరి 28న విజయవాడలోని రమేష్ ఆస్పత్రిలో చేరారు. ఆ రోజు నుంచి వెంటిలేటర్‌పైనే బచ్చుల చికిత్స పొందుతున్నారు.పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస (MLC Bachula Arjunudu Dies) విడిచారు.

ఆయన గత కొన్నివారాలుగా మృత్యువుతో పోరాడారు. ఆయనను బతికించేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. గురువారం మధ్యాహ్నం బచ్చుల ఆరోగ్యం మరింత క్షీణించి అవయవాలు అన్నీ పనిచేయకపోవడంతో సాయంత్రం తుదిశ్వాస (TDP MLC Bachula Arjunudu Passed Away) విడిచారు. అర్జునుడు మృతితో బచ్చుల కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అర్జునుడి మృతికి పలువురు టీడీపీ ముఖ్యనేతలు సంతాపం తెలిపారు.

విశాఖకు చేరుకున్న సీఎం జగన్, రెండు రోజుల పాటు గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌లో పాల్గొననున్న ఏపీ ముఖ్యమంత్రి, సమ్మిట్ కోసం ఘనంగా ఏర్పాట్లు చేసిన ఏపీ ప్రభుత్వం

2021లోనూ బచ్చుల గుండెపోటుకు గురయ్యారు. అప్పుడు కూడా ఇదే రమేశ్ ఆస్పత్రికి తరలించి కుటుంబ సభ్యులు వైద్యం చేయించారు. అత్యవసర శస్త్రచికిత్స (Emergency Surgery) అందించడంతో గతంలో ప్రాణాపాయం తప్పింది. సర్జరీ తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితి కుదుటపడింది. అయితే జనవరి-28న మరోసారి గుండెపోటు వచ్చింది.కరోనా సమయంలో బచ్చులకు రెండుసార్లు వైరస్ (Corona Virus) సోకింది.

ఏపీ గ్లోబల్‌ ఇన్వెస్టర్‌ సమ్మిట్‌పై మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌, విజయవంతం కావాలని ఆకాంక్షించిన తెలంగాణ మంత్రి

అప్పటి నుంచి ఆయన పూర్తిగా కోలుకోలేదని తెలుస్తోంది. కరోనా తర్వాత ఊపిరితిత్తుల సమస్యతో బాధపడటం, గుండెపోటు రావడం జరుగుతోందని బచ్చుల అనుచరులు చెబుతున్నారు.స్థానిక ఎమ్మెల్యే వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi) టీడీపీకి (TDP) దూరమవ్వడంతో గన్నవరం (Gannavaram) బాధ్యతలను బచ్చులకు చంద్రబాబు అప్పగించారు.