Rain Alert in AP: ఏపీకి మళ్లీ తుఫాను గండం, మూడు రోజుల పాటు భారీ వర్షాలు, హెచ్చరించిన భారత వాతావరణ శాఖ, తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సీఎం ఏరియల్ సర్వే, నివర్‌ తుపాన్‌ మృతులకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియా
heavy-rainfall-warning-to-AP(Photo-ANI)

Amaravati, Nov 29: నివర్ తుఫాను కల్లోలం మరచిపోకముందే మళ్లీ ఏపీని భారీ వర్షాలు (Rain Alert in AP) ముంచెత్తనున్నాయి. అగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. రాగల 48 గంటల్లో అల్పపీడనం వాయుగుండంగా మారనుందని వాతావరణ శాఖ తెలిపింది. డిసెంబర్‌ 2న దక్షిణ తమిళనాడు-పాండిచ్చేరి మధ్య తీరందాటే అవకాశం ఉందని పేర్కొంది. రాగల 3 రోజుల్లో దక్షిణ కోస్తాంధ్రలో భారీ నుంచి అతిభారీ వర్షాలు వర్షాలు కురిసే అవకాశం ( more rains in the next three days) ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

దీంతో పాటు తూర్పు హిందూ మహాసముద్రం – దక్షిణ అండమాన్‌ సముద్రం మీద 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం వ్యాపించి ఉంది. దీని ప్రభావం వల్ల రాగల 36 గంటల్లో (ఈ నెల 29న) ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ శుక్రవారం రాత్రి వెబ్‌సైట్‌లో ప్రకటించింది. తదుపరి 24 గంటల్లో ఇది క్రమంగా బలపడి తమిళనాడు–పుదుచ్చేరి మీదుగా అరేబియా సముద్రం వైపు పయనించి డిసెంబర్‌ 2 తర్వాత తుపానుగా మారే సూచనలున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

తీరాన్ని తాకిన నివర్ తుఫాను, అయినా పొంచి ఉన్న పెనుముప్పు, తమిళనాడు, ఏపీలో అతి భారీ వర్షాలు, పలు రైళ్ల రాకపోకలు రద్దు, తిరుమలలో విరిగిపడిన కొండ చరియలు

ఇది తుపానుగా మారితే.. మాల్దీవులు సూచించిన ‘బురేవి’గా పేరు పెట్టనున్నారు. అదేవిధంగా.. మధ్య బంగాళాఖాతం పరిసరాల్లో వచ్చే నెల 5న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండగా.. ఇది క్రమంగా బలపడి తుపానుగా మారితే దీనికి మయన్మార్‌ సూచించిన ‘టకేటీ’గా పేరు పెడతారు. కాగా గడిచిన 24 గంటల్లో నివర్‌ ప్రభావంతో.. రాష్ట్రమంతటా భారీ వర్షాలతో పాటు మోస్తరు వానలు విస్తారంగా కురిశాయి. కోస్తా తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయని అధికా>రులు తెలిపారు.

నివర్‌ తుపాను ప్రభావంతో దెబ్బతిన్న మూడు జిల్లాల్లో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహించారు.‌ శనివారం ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ గన్నవరం విమానశ్రయం నుంచి నేరుగా చిత్తూరు జిల్లాకు వచ్చారు. అక్కడ నుంచి తుపాను ప్రభావిత ప్రాంతాల్లో నష్టాన్ని ఏరియల్‌ సర్వే ద్వారా పరిశీలించారు. అనంతరం రేణిగుంట విమానాశ్రయంలో వైఎస్సార్‌, చిత్తూరు, నెల్లూరు జిల్లాల కలెక్టర్లు, అధికారులతో వరద ప్రభావంపై సమీక్ష చేపట్టారు.

Here's CMO Tweet

వరద నష్టంపై తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించిన సీఎం స్థానిక అధికారులతో పంటనష్టంపై సుదీర్ఘంగా చర్చించారు. సమీక్ష అనంతరం సీఎం మాట్లాడుతూ.. పంటనష్టాన్ని సమగ్రంగా పరిశీలించామని, ప్రతిఒక్క వరద బాధితుడిని మానవతాధృక్పథంతో చూడాలని అన్నారు. తుపాను ప్రభావంతో చిత్తూరు జిల్లాలో ఆరుగురు, కడప జిల్లాలో ఇద్దరు మృతిచెందారని వారి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియాను వెంటనే అందించాలని అధికారులను ఆదేశించారు.

వేల ఎకరాల్లో పంట నష్టంతో కుదేలైన రైతన్న

అలాగే పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రతిఒక్కరికి రూ.500 చొప్పున తక్షణ సాయం ప్రకటించాలన్నారు. పంట నష్టంపై తక్షణం అంచనాలు వేసి నివేదిక అందించాలని అధికారులను కోరారు. దెబ్బతిన్న ప్రాజెక్టుల వద్ద యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టాలని సూచించారు. కాగా నివర్‌ తుపాన్‌ తీవ్ర ప్రభావం చూపిన చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల్లో సీఎం జగన్‌ శనివారం ఏరియల్‌ సర్వే నిర్వహించిన విషయం తెలిసిందే. అనంతరం తుపాను ప్రభావిత జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో తిరుపతి ఎయిర్‌పోర్ట్‌లో భేటీ అయ్యారు. నష్టపోయిన రైతులను అదుకునే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు.