APSRTC: రేపు ఉదయం 7గంటలకు తొలి బస్సు సర్వీస్, 1683 బస్సులు రోడ్డు మీదకి, బస్సులు తిరగనున్న నేపథ్యంలో వివరాలను వెల్లడించిన ఎండీ మాదిరెడ్డి ప్రతాప్‌
APSRTC | Photo: Twitter

Amaravati, May 20: లాక్ డౌన్ (Lockdown) కారణంగా డిపోలకే పరిమితం అయిన ఆర్టీసీ బస్సులు (APSRTC) ఇప్పటికే తెలంగాణలో పునఃప్రారంభమయ్యాయి. రేపటి నుంచి ఏపీలో పరుగులు పెట్టనున్నాయి. డిపోల్లో ఉన్న బస్సులను శుభ్రం చేసే కార్యక్రమం కొనసాగుతోంది. గత 58 రోజులుగా డిపోలకే బస్సులు పరిమితం కావడంతో... వాటి ఇంజిన్ కండిషన్ ను చెక్ చేస్తున్నారు. నా బలం మీరే,మీపైనే పూర్తి నమ్మకం, రాబోయే రోజుల్లో కరోనా భారీన పడని వారు ఉండరేమో.., అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఏపీ సీఎం సమీక్ష, ఏపీలో తాజాగా 68 కేసులు నమోదు

గురువారం ఉదయం 7గంటలకు తొలి బస్సు సర్వీస్ ప్రారంభిస్తున్నామని సంస్థ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్‌ ( APSRTC MD Madireddy Pratap) తెలిపారు. సిటీ బస్సు సర్వీసులు తరువాత ప్రారంభిస్తామని చెప్పారు. అంతర్రాష్ట్ర సర్వీసులపై నిషేధం కొనసాగుతుందన్నారు. రాత్రిపూట కర్ఫ్యూ ఉంటుంది. అయినా వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని రాత్రి పూట బస్సులు నడుపుతామని పేర్కొన్నారు. కానీ, బస్ స్టాండ్‌కి రాత్రి 7 లోపు చేరుకోవాలని సూచించారు. అయితే విశాఖ, విజయవాడలో సిటీ బస్సులు నడపడటం లేదు.

Here's the tweet:

Intrastate bus services will resume in Andhra Pradesh from tomorrow. Initially, 1683 buses will be run on 434 roots outside #COVID19 containment zones: Madireddy Pratap, Managing Director of Andhra Pradesh State Road Transport Corporation pic.twitter.com/NxQ5auEE7M

రేపటి నుంచి ఏపీలో బస్సులు తిరగనున్న నేపథ్యంలో కొన్ని వివరాలు

రోజుకు 12 గంటల పాటు మాత్రమే బస్సులు తిరుగుతాయి

ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 వరకు బస్సులు నడుస్తాయి

ఈరోజు సాయంత్రం నుంచే రిజర్వేషన్లు అందుబాటులో ఉంటాయి

ఆన్ లైన్లో టికెట్లు బుక్ చేసుకోని వారి కోసం... డిపోల్లో బస్సు ఎక్కే ముందు టికెట్లను ఇచ్చే ప్రక్రియను అందుబాటులోకి తీసుకురానున్నారు

బస్సుల్లో టికెట్లు ఇవ్వడం అన్నది ఉండదు

తొలి విడతగా 1500 బస్సులు తిరగనున్నాయి

బస్సుల్లో శానిటైజర్లు అందుబాటులో ఉంటాయి

ప్రయాణికులు మాస్కులు కచ్చితంగా ధరించాలి

బస్సులు మధ్యలో ఎక్కడా ఆగవు. కేవలం గమ్యస్థానంలో మాత్రమే ఆగుతాయి

Here's APSRTC Tweet

అంతరాష్ట్ర సర్వీసులు నడపాలని భావించాం. ఆయా రాష్ట్రాల అనుమతి కోసం లేఖలు రాశాం. వారి నుంచి అనుమతి వచ్చాక అంతరాష్ట్ర సర్వీసులు ప్రారంభిస్తాం. సూపర్ లగ్జరీ బస్సుల్లో సీట్లను కుదించాం. పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సుల్లో కూర్చోకూడని సీట్లకు మార్క్ చేశాం. బస్సుల్లో ప్రయాణించే ప్రతి ఒక్క ప్రయాణికుడు మాస్క్ తప్పనిసరిగా ధరించాలి. బస్ స్టాండ్‌లలో మాస్క్‌లు అందుబాటులో ఉంటాయి. 10 రూపాయలకు మాస్క్ అమ్మాలని నిర్ణయించాం.

నిత్యావసర వస్తువుల కోసం కొన్ని బస్సులు తిప్పాం. వలస కూలీల కోసం అన్ని చెక్ పోస్ట్‌లలో బస్సులు ఉంచాం. రిలీఫ్ సెంటర్‌లలో వాళ్లని చేరవేసేందుకు జిల్లా అధికారుల ఆదేశాల మేరకు బస్సులు ఏర్పాటు చేశాం. ప్రతి బస్ స్టాండ్‌లో శానీటైజర్ సదుపాయాన్ని కల్పిచాము. బస్సు ఎక్కే ముందు ప్రతి ఒక్క ప్రయాణికుడు శానిటైజర్‌తో చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. నగదు రహితంగా, పేపర్ లేకుండా టికెట్ ఇవ్వాలని చాలా కాలం కసరత్తు చేశాం. ఆర్డినరి, ఎక్స్ ప్రెస్, అల్ట్రా డీలక్స్, డీలక్స్ బస్సులకు ఆన్లైన్ రిజర్వేషన్ కల్పించాలని నిర్ణయించాం.

ఏ రోజుకు ఆ రోజు బుకింగ్ చేస్తే, వాటికి రిజర్వేషన్‌ చార్జీలు వసూలు చేయడం లేదు. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, గూగుల్ పే లాంటి అన్ని రకాల వ్యాలెట్‌ల ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చు. 65 ఏళ్ళు దాటిన వాళ్ళు, 10 ఏళ్ల లోపు పిల్లలను అత్యవసర మైతేనే (మెడికల్ ఎమెర్జెన్సీ) బస్సులో అనుమతిస్తాం. నెమ్మదిగా ఆర్ధిక వృద్ధి పెంచే దిశగానే బస్సు సర్వీసులు పెంచుతున్నాం. కాబట్టి 70% సర్వీసులు, అంటే 1683 బస్సులు మాత్రమే ప్రారంభిస్తున్నాం. ఎండాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని కొన్ని ఏసీ బస్సులు నడుపుతాం. కానీ దుప్పట్లు ఇవ్వము. ఛార్జీలను పెంచట్లేదు’ అని ఆర్టీసీ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్ చెప్పారు