Andhra Pradesh Transport Minister Perni Nani(photo-Twitter)

Amaravati, May 18: ఏపీలో ప్రజా రవాణాపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నిర్ణయం (AP CM YS Jagan) తీసుకుంటారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పేర్ని నాని (Transport Minister Perni Nani) తెలిపారు. ముఖ్యమంత్రి నుంచి ఆదేశాలు రాగానే కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలకు అనుగుణంగా బస్సు సర్వీసులను పునఃప్రారంభించేందుకు ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. నాలుగు రాష్ట్రాల ప్రజలకు నో ఎంట్రీ, ఆర్టీసీ బస్సులు,ప్రైవేటు బస్సుల రవాణాకు అనుమతి, బస్సులను ఎప్పటికప్పుడు శానిటైజ్‌ చేయాలన్న కర్ణాటక సీఎం బి.ఎస్.యడ్యూరప్ప

రాష్ట్రాల మధ్య, రాష్ట్రం లోపల బస్సులు నడిపేందుకు అన్ని జాగ్రత్తలతో బస్సులు తిరిగేందుకు ఏర్పాట్లు చేశామని మంత్రి పేర్ని నాని తెలిపారు. లాక్‌డౌన్‌ (Lockdown) నేపథ్యంలో కేంద్ర నిబంధనలు, రాష్ట్రంలో పరిస్థితుల అనుగుణంగా బస్సులు నడుపుతామని తెలిపారు. శ్రీవారి దర్శనం ఇప్పట్లో లేనట్లే, ఏపీలో మే 31 వరకు దేవాలయాల్లోకి భక్తులకు నో ఎంట్రీ, ఈ నెల 28న టీటీడీ పాలకమండలి సమావేశం

ఏపీలో కొత్తగా 52 కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. ఈ కొత్త కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,282కి చేరింది. ఈ 52 కేసుల్లో చిత్తూరు-15, తూర్పుగోదావరి-05, కడప 2, కృష్ణా- 15, కర్నూలు-04, నెల్లూరు-07, విశాఖ, విజయనగరంలో ఒక్కో కేసు నమోదయ్యాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో రెండు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాని ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.  ఏపీని వణికిస్తున్న కోయంబేడు మార్కెట్, కొత్తగా నమోదవుతున్న కేసులన్నీ అక్కడివే, ఏపీలో 2,282కి చేరిన కోవిడ్ 19 కేసుల సంఖ్య

రాష్ట్రంలో గత 24 గంటల్లో (ఆదివారం 9గంటల నుంచి సోమవారం 9 గంటలవరకు) 9,713 శాంపిల్స్‌ను పరీక్షించగా 52 మంది పాజిటివ్‌గా నిర్దారింపబడింది. కొత్తగా 94 మంది కరోనాను జయించి సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ చేయబడ్డారు. వీరిలో గుంటూరు-40, కర్నూలు- 28, కృష్ణ-10, చిత్తూరు-05, తూర్పుగోదావరి-04, విశాఖపట్నం-04, అనంతపురం-02, కడప- ఒక్కరు డిశ్చార్జ్ అయినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. రాష్ట్రంలో నమోదైన మొత్తం 2282 పాజిటివ్ కేసులకుగాను 1527 మంది డిశ్చార్జ్ అయ్యారు. అయితే.. ఇప్పటి వరకూ 50 మంది మరణించారు. గత రెండ్రోజులుగా ఏపీలో కరోనా మరణాలేమీ సంభవించలేదు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 705గా ఉంది.