Representational Image | (Photo Credits: IANS)

Srikakulam, Mar 18: ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో కానిస్టేబుల్ పై ఇద్దరు వ్యక్తులు దాడి (Two youths beats up a constable) చేసిన ఘటన చోటు చేసుకుంది. ట్రాఫిక్‌కు అంతరాయంగా ఉన్న ద్విచక్ర వాహనాలు తొలగించాలని చెప్పిన హెడ్‌ కానిస్టేబుల్‌పై (constable in Srikakulam) ఇద్దరు యువకులు దాడి చేసిన సంఘటన పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది.

కాశీబుగ్గ సీఐ సాకేటి శంకరరావు తెలిపిన వివరాల ప్రకారం.. కాశీబుగ్గ పాత జాతీయ రహదారిలోని ఓ టిఫిన్‌ సెంటర్‌ వద్ద ఎస్సీ వీధికి చెందిన బోస్‌ రాంబాబు, బోస్‌ కుమార్‌లు పూటుగా మద్యం తాగి ద్విచక్ర వాహనాలతో ట్రాఫిక్‌ ఇబ్బందులు కలిగించగా.. అటుగా వెళ్తున్న కాశీబుగ్గ పోలీసు స్టేషన్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ బి.శ్రీనివాసరావు వారిని నియంత్రించే ప్రయత్నం చేశారు. అక్కడి పరిస్థితిని అధికారులకు తెలియజేసేందుకు ఫొటోలు తీస్తుండగా యువకులు ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు.

విశాఖపట్నం రైల్వే స్టేషన్​‌కు కీలక గుర్తింపు, ఒక స్టేషన్ ఒక ఉత్పత్తి కార్యక్రమానికి ఎంపిక, తూర్పు కోస్తా రైల్వే లో మొట్టమొదటి స్టేషన్​గా విశాఖను ఎంపిక చేసిన కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ

విషయం తెలుసుకున్న మిగిలిన పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వారిని నియంత్రించారు. గురువారం ఇద్దరినీ అరెస్టు చేసి 14 రోజుల రిమాండ్‌కు తరలించారు.