Andhra Pradesh CM YS Jagan Mohan Reddy (Photo Credits: IANS)

Amaravati, july 12: కర్ఫ్యూ సడలింపులపై ఏపీ ప్రభుత్వం (AP Govt) తాజా ప్రకటన విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కర్ఫ్యూ సడలిస్తున్నట్టు (COVID-19 Curfew Relaxation) ప్రకటనలో పేర్కొంది. దీంతో అన్ని జిల్లాల్లో ఒకే విధంగా కర్ఫ్యూ సడలింపులు ఇచ్చారు. గతంలో 8 జిల్లాలకు రాత్రి 9 గంటల వరకు ఇచ్చిన సడలింపులను తాజాగా అన్ని జిల్లాలకు వర్తించేలా ఉత్తర్వులు జారీ చేశారు. రాత్రి 9 గంటలకల్లా దుకాణాల మూసివేయాలని ఆదేశించింది. రాత్రి 10 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ నిబంధనలు అమల్లో ఉండనున్నాయి.

ఇక మాస్క్‌ లేకపోతే రూ.100 జరిమానా విధించనున్నారు. మాస్క్‌ ధరించకపోతే రూ.100ల జరిమానా కచ్చితంగా అమలు చేసేవిధంగా నిర్ణయం తీసుకున్నారు. దుకాణాల్లో కూడా సిబ్బంది దగ్గర నుంచి వినియోగదారులకు వరకూ మాస్క్‌లు ధరించాల్సిందే. ఉల్లంఘనలకు పాల్పడితే దుకాణాలకు భారీ జరిమానాలతో పాటు అవసరమైతే 2–3 రోజులు దుకాణాలు మూసివేతకు ప్రభుత్వం ఆదేశించింది.

కరోనా షాక్..వృద్ధురాలిపై ఒకేసారి ఆల్ఫా, బీటా వేరియంట్ల దాడి, చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయిన బెల్జియం మహిళా వృద్ధురాలు, రెండు వేరియంట్లు ఎలా సోకాయనే విషయం అంతుచిక్కడం లేదని తెలిపిన నివేదిక

ఉల్లంఘనలకు పాల్పడ్డారని ఎవరైనా ఫొటో తీసి పంపినా జరిమానాలు విధించే విధంగా దీని కోసం ప్రత్యేక వాట్సాప్‌ నంబర్‌ ఏర్పాటు, రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్‌ కఠినంగా అమలు జరిగే విధంగా ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజలెవ్వరూ గుమిగూడకుండా కఠిన ఆంక్షలతో పాటు మార్కెట్లు, తదితర చోట్ల కూడా మాస్క్‌లు ధరించాలంటూ ఆదేశాలు జారీ అయ్యాయి. మార్కెట్‌ కమిటీలు మాస్క్‌లు ధరించేలా చూడాలంటూ ప్రభుత్వం ఆదేశించింది.