
Venkatagiri, Mar 21: నెల్లూరు జిల్లా వెంకటగిరిలో (Venkatagiri in Nellore ) ఘోరం చోటు చేసుకుంది. నగరంలోని కాలేజీమిట్టలో చెంచు కృష్ణ అనే యువకుడు.. జ్యోతి (18) అనేయువతి గొంతు (Youngster slits throat of a girl) కోశాడు. ప్రేమించడం లేదనే కోపంతో..కాలేజీకి వచ్చిన అమ్మాయిపై దాడికి తెగబడ్డాడు. తీవ్రంగా గాయపడ్డ బాధితురాలి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. జ్యోతి ఇంటర్మీడియట్ చదువుతోంది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్నారు. బాధితురాలి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
ఇక చిత్తూరు జిల్లా మదనపల్లి మండల పరిధిలో కళాశాల విద్యార్థిని అదృశ్యంపై పోలీసులకు ఫిర్యాదు అందింది. పోలీసుల కథనం మేరకు, మదనపల్లె మండలం కోళ్లబైలు పంచాయతీ వైఎస్సార్ కాలనీకి చెందిన మౌనిక(19), స్థానిక కోమటివాని చెరువు సమీపంలోని కళాశాలలో ఇంటర్ చదువుతోంది.
ఈ నెల 19న కళాశాలకు వెళ్లిన విద్యార్థిని తిరిగి ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆదివారం టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు ఎస్‌ఐ చంద్రమోహన్ తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు ఎస్‌ఐ -9440796741కు సమాచారం ఇవ్వాలని కోరారు.