Suicide Representative Image (Photo Credits: File Photo)

Nandigama, Jan 12: ఏపీలో ఎన్టీఆర్‌ జిల్లా నందిగామ ప్రాంతంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఉన్నత విద్య కోసం లండన్‌ బయలుదేరి వెళ్లవలసిన ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో చెట్టుకు ఉరి వేసుకుని మృతి (youth suspicious death) చెందాడు. కొడుకు మృతిని చూసిన తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. నందిగామ పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం నందిగామ (nandigama ntr district) శివారు హనుమంతుపాలెంకు చెందిన గాడిపర్తి వెంకటనారాయణ కొంతకాలంగా నందిగామ పట్టణంలో నివాసం ఉంటున్నారు.

12 ఏళ్లకే గుండెపోటు, నిద్రలోనే ఉలిక్కిపడిలేచి విలవిలలాడిన చిన్నారి, ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గం మధ్యలోనే కన్నుమూత

వెంకటనారాయణ, రాణి దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు గోపీకృష్ణ లండన్‌లో ఉన్నత చదువులు చదువుతున్నాడు. రెండవ కుమారుడు గాడిపర్తి శివకృష్ణ (24) గత ఏడాది బీటెక్‌ డిగ్రీ పూర్తి చేశాడు. ఉన్నత చదువుల కోసం బుధవారం తెల్లవారుజామున లండన్‌ బయలుదేరేందుకు హైదరాబాదు వెళ్లవలసి ఉంది. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం సుమారు 3:30 గంటల సమయంలో తన మిత్రులను కలిసి వస్తానని చెప్పి శివకృష్ణ ద్విచక్ర వాహనంపై ఇంటి నుంచి బయటకు వెళ్లాడు.

వితంతువుపై తెగబడిన కామాంధులు, ఇంట్లోకి దూరి దారుణంగా అత్యాచారం, ఆపై మంచం మీదనే చంపేసి కాల్చివేసిన దుండగులు

సాయంత్రం ఐదు గంటలకు హైదరాబాద్‌ విమానాశ్రయానికి వెళ్లేందుకు కుటుంబ సభ్యులు అంతా సిద్ధం చేశారు. బయటికి వెళ్లిన శివకృష్ణ ఎంతసేపటికీ తిరిగి రాలేదు. దీనికి తోడు ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ చేసి ఉండడంతో తల్లిదండ్రులు ఆందోళనతో మిత్రులను ఆరా తీశారు. అయినా ఆచూకీ తెలియలేదు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం నవాబుపేట సమీపంలోని పొలాల్లో చెట్టుకి ఉరివేసుకొని ఓ యువకుడి మృతదేహం కనిపించడంతో అటుగా వచ్చిన రైతులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

అప్పటికే తమ కుమారుడి కోసం వెతుకుతున్న వెంకటనారాయణ కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి వెళ్లి మృతుడు శివకృష్ణగా గుర్తించారు. దీంతో వత్సవాయి పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. శివకృష్ణ మృతదేహానికి బుధవారం నందిగామ పట్టణంలో పంచనామా నిర్వహించారు. శివకృష్ణ మృతదేహాన్ని ఎమ్మెల్యే డాక్టర్‌ మొండితోక జగన్‌ మోహనరావు, ఎమ్మెల్సీ డాక్టర్‌ మొండితోక అరుణకుమార్‌ పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియపరిచారు. ఉన్నత చదువులకు లండన్‌ వెళ్లవలసిన శివకృష్ణ మృతి చెందడం బాధాకరమన్నారు.