AP Government logo (Photo-Wikimedia Commons)

Amaravati, June 14: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని హోటళ్లు, రెస్టారెంట్ల వ్యాపార వేళలను పొడిగిస్తూ జగన్ ప్రభుత్వం (YS Jagan government) సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. బార్‌ అండ్‌ రెస్టారెంట్లు మినహా ఇతర ఆహార దుకాణాలు (restaurants and hotels) ఉదయం ఐదు గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు కార్యకలాపాలు కొనసాగించుకోవచ్చని పేర్కొంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి(ఎఫ్‌ఏసీ) జి.అనంతరాము మార్గదర్శకాలు విడుదల చేశారు. కోవిడ్‌ నేపథ్యంలో జారీ చేసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనల గడువు మార్చితో ముగియడంతో కొత్త ఉత్తర్వులు(5 am till midnight) వెంటనే అమలులోకి వస్తాయని స్పష్టం చేశారు. ఏపీ హోటల్‌ అసోసియేషన్‌ అభ్యర్థన మేరకు వ్యాపార వేళలను పెంచినట్టు తెలిపారు. కోవిడ్‌ జాగ్రత్తలు పాటిస్తూ వ్యాపారులు, వినియోగదారులు విధిగా మాస్క్‌ ధరించడంతో పాటు శానిటైజర్‌ వాడాలని సూచించారు. అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం, డ్రైవర్ నిర్లక్ష్యానికి 5 మంది మృతి, అల్లూరి సీతారామరాజు జిల్లా అడవి ప్రాంతంలో అదుపుతప్పి బోల్తాపడిన బస్సు

ఇక ఏ తరహా ప్రసవాలు జరిగినా వైఎస్సార్‌ ఆరోగ్య ఆసరా కింద తల్లులకు రూ.ఐదు వేల చొప్పున ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. సహజ ప్రసవమైనా, సిజేరియన్‌ జరిగినా ఈ మొత్తాన్ని అందించాలన్నారు. గతంలో సిజేరియన్‌ జరిగితే రూ.3 వేలే ఇస్తున్నారని, దీన్ని రూ.5 వేలకు పెంచాలని సూచించారు. సహజ ప్రసవమైనా, సిజేరియన్‌ అయినా తల్లీబిడ్డల సంరక్షణ ముఖ్యం కాబట్టి ఒకే మొత్తాన్ని ఇవ్వాలన్నారు.

సహజ ప్రసవాల సంఖ్యను పెంచడంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అవగాహన, చైతన్యం కల్పించాల్సిన బాధ్యత వైద్యులపై ఉందన్నారు. వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ, వైద్య ఆరోగ్యశాఖలో నాడు–నేడు, కొత్త మెడికల్‌ కాలేజీల నిర్మాణం, క్యాన్సర్‌ కేర్, కోవిడ్‌ తదితరాలపై సీఎం జగన్‌ సోమవారం క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.