CM Jagan in Action: వ్యవసాయ రంగంపై సీఎం జగన్ సమీక్ష, డ్రోన్ల వినియోగం పెంచి, రైతులకు గరిష్ఠ లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు
CM-YS-jagan-Review-Meeting

Amaravati, August 5: ఏపీ రాష్ట్రంలోని రైతులకు గరిష్ఠ లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌.. సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో వ్యవసాయంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ..రైతులకు ఎరువులు అందించడంలో ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని సంబంధిత మంత్రిత్వశాఖను, అధికారులను ఆయన ఆదేశించారు. అంతేకాదు ఎక్కడ నుంచి ఎలాంటి సమాచారం వచ్చినా పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఆర్బీకేల్లో ఉన్న అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌ నుంచి ప్రతి రోజూ నిరంతరం సమాచారం తెప్పించుకోవాలన్న సీఎం జగన్‌.. విత్తనాల సరఫరా, ఎరువుల పంపిణీ, వ్యవసాయ ఉత్పత్తులకు అందుతున్న ధరలు తదితర అంశాలపై పర్యవేక్షణ ఉండాలని తెలిపారు. ఈ-క్రాప్‌ వందశాతం పూర్తిచేయాలని, వైయస్సార్‌ ఉచిత పంటల బీమా పథకంతో ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన భాగస్వామ్యం కానుందని తెలిపారు. రైతులకు గరిష్ట లబ్ధి చేకూర్చేలా తగిన చర్యలు తీసుకోవాలన్న సీఎం జగన్‌.. వ్యవసాయ రంగంలో డ్రోన్ల వినియోగంపైనా ప్రధానంగా చర్చించారు.

మాటల్లో కాకుండా చేతల్లో చూపించిన సీఎం జగన్, చిన్నారికి రూ.10 వేల తక్షణ ఆర్థిక సహాయంతో పాటు పింఛను మంజూరు, రూ. 35 వేల వీల్ చైర్

డ్రోన్ల వినియోగంపై మాస్టర్‌ ట్రైనర్లను తయారు చేయాలన్న ఆయన.. డ్రోన్ల నిర్వహణ, మరమ్మతుపై శిక్షణ ఇచ్చే దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులతో చెప్పారు. అంతేకాదు.. నియోజకవర్గానికి ఒక ఐటీఐ లేదంటే ఒక పాలిటెక్నిక్‌ కాలేజీలోని విద్యార్థులకు డ్రోన్ల వినియోగం, నిర్వహణ, మరమ్మతులపై సంపూర్ణ శిక్షణ ఇప్పించాలని సూచించారు.