Guntur, July 8: వైఎస్సార్‌సీపీ ప్లీనరీ సమావేశాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ భార్య విజయమ్మ ప్రసంగిస్తున్నారు. వైఎస్ విజయమ్మ మాట్లాడుతూ.. ప్రజల అభిమానం నుంచి వైఎస్సార్‌సీపీ పుట్టిందని.. ఎన్నో కష్టాలను ఎదుర్కొని నిలిచామని వైఎస్ విజయమ్మ అన్నారు. అన్యాయంగా కేసులు పెట్టి వేధించారు. అధికార శక్తులన్నీ జగన్‌పై విరుచుకుపడ్డా బెదరలేదు.
జగన్ ఓర్పు, సహనంతో ఎంతో ఎత్తుకు ఎదిగారు. ఎలాంటి వివక్ష లేకుండా అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నారని వైఎస్ విజయమ్మ అన్నారు. వైఎస్సార్ అందరివాడని.. కోట్ల మంది హృదయాల్లో సజీవంగా ఉన్నారని వైఎస్ విజయమ్మ అన్నారు. ఈ రోజు సగర్వంగా ప్లీనరీ జరుపుకుంటున్నాం. ఇచ్చిన మాట నుంచి వైఎస్సార్‌సీపీ పుట్టిందన్నారు.
గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, జగనన్న అమ్మ ఒడి, పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి పాలనలో విప్లవాలు తెచ్చారని వైఎస్ విజయమ్మ అన్నారు. ‘‘జగన్ చెప్పినవే కాకుండా చెప్పనవీ కూడా చేస్తున్నారు. హామీలన్నీ అమలు చేశాం కాబట్టే ఇంటింటికీ ఎమ్మెల్యేలు వెళ్తున్నారు. రూ.1.60 లక్షల కోట్లు నేరుగా లబ్ధిదారులకు అందించాం. అభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని’’ వైఎస్ విజయమ్మ పేర్కొన్నారు.
రాజశేఖరరెడ్డి అందరివాడు. మీ అందరి హృదయాల్లో వైఎస్సార్‌గారు సజీవంగా ఉన్నారు. ఆనాడు అధికార శక్తులన్నీజగన్‌పై విరుచుకుపడ్డా బెదరలేదు. అన్యాయంగా కేసులు పెట్టి వేధించారు. 2011లో కాంగ్రెస్ పొమ్మనలేక పొగపెట్టింది. జగన్ ఓర్పు, సహనంతో ఎంతో ఎత్తుకు ఎదిగారు.ఉద్దండ నాయకులకే వైఎస్ జగన్ గొంతు ఎండిపోయేలా చేశారు. ఈ రోజు సగర్వంగా ప్లీనరీ జరుపుకుంటున్నాం. మీ అందర్నీ ఆశీర్వదించడానికి, అభినందించడానికి నేను వచ్చాను. ప్రజల అభిమానం, ఇచ్చిన మాట నుంచి వైఎస్సార్‌సీపీ పుట్టింది. ఎలాంటి వివక్ష లేకుండా అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, జగనన్న అమ్మ ఒడి, పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి పాలనలో విప్లవాన్ని తెచ్చారు. జగన్ చెప్పినవే కాకుండా చెప్పనివి కూడా చేశారు.