Amaravati, August 7: సాధారణంగా దేవుళ్లకు, సినీ తారలకూ కొన్నిచోట్ల ఆలయాలు నిర్మిస్తుంటారు. అయితే, ఇప్పుడు ఏపీ సీఎం వైయస్ జగన్ కు కూడా గుడి (CM YS Jagan Temple) కడుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం మండంలం రాజుపాలెంలో వైసీపీ నేతలు సీఎం జగన్ కు ఆలయం (CM YS Jagan Mohan Reddy Temple) నిర్మిస్తున్నారు. ఈ గుడిలో సీఎం జగన్ విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. ఈ ఆలయానికి గోపాలపురం నియోజకవర్గ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు (MLA Venkatarao Talari) శంకుస్థాపన చేశారు. భూమి పూజ సందర్భంగా తలారి వెంకట్రావు మాట్లాడుతూ సీఎం జగన్ ను ఆకాశానికెత్తేశారు.
దేశంలోనే కరోనా చర్యల్లో ఏపీ అగ్రగామిగా ఉందని కీర్తించారు. ఏపీ సీఎం జగన్ తీసుకుంటున్న సాహసోపేత నిర్ణయాలను ఇతర రాష్ట్రాల నేతలు కొనియాడుతున్నారని వెల్లడించారు. కోవిడ్ అడ్డంకులు సృష్టిస్తున్నా, సీఎం జగన్ వెనుకంజ వేయకుండా కృషి చేస్తున్నారని, సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళుతున్నారని కితాబునిచ్చారు. కాగా, ఈ ఆలయాన్ని స్థానిక వైసీపీ నేత కురుకూరి నాగేశ్వరరావు కుటుంబం నిర్మిస్తోంది. ఈ మేరకు తలారి వెంకట్రావు తన ఫేస్ బుక్ ఖాతాలో ఫోటోలను పోస్ట్ చేశారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో 265 మందికి కరోనా, హోమ్ ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స, అదే జైలులో రిమాండులో ఉన్న టీడీపీ నేత కొల్లు రవీంద్ర, ఈఎస్ఐ స్కాం నిందితులు
Here's MLA Share Tweet
తమిళనాడు వంటి రాష్ట్రాలలో రాజకీయ నాయకులకు గుడికట్టిన సందర్భాలను అనేకం ఉన్నాయి. తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేసిన జయలలితకు గుళ్ళు కట్టి పూజలు చేసిన అభిమానులున్నారు. అయితే ఈ గుడి విషయంపై ఏపీ ప్రభుత్వం కాని సీఎం కాని ఇంకా అధికారికంగా స్పందించలేదు.