Vij, Oct 25: పెందుర్తి చిన ముషిడివాడలోని శారదా పీఠానికి మరో ఎదురు దెబ్బ తగిలింది. పీఠానికి అనుకొని ఉన్న సర్వే నంబర్ 90 లో సుమారు 20 సెంట్లు భూమి గడ్డ స్థలంలో ఉందని పెందుర్తి ఎంఆర్ఓ ఆనంద్ కుమార్ ప్రకటించారు. ఇదే విషయమై ఆయన తమ కార్యాలయంలో శుక్రవారం మీడియాను ఉద్దేశించి మాట్లాడుతూ.. తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ ఫిర్యాదు ప్రకారం రికార్డులను పరిశీలించిన అనంతరం శారదా పీఠానికి చెందిన కొంత భూమి గడ్డ స్థలంలో ఉందన్నారు. అయితే ఆ భూమిని స్వాధీనం చేసుకునే అధికారం తనకు లేదని.. తమ పై అధికారులు ఆదేశాల ప్రకారం నడుచుకుంటామన్నారు. విషయం సున్నితమైనది కావడంతో పై అధికారులు దృష్టికి తీసుకువెళతామని పేర్కొన్నారు.
శారదా పీఠం అక్రమాలపై మరోసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలుస్తానన్నారు తెలుగు శక్తి నేత బి.వి.రామ్ . శారదా పీఠంతో పాటు రాష్ట్రంలో ప్రభుత్వ భూమి ఎక్కడ కూడా అన్యాక్రాంతం కాకూడదని తెలుగు శక్తి ప్రధాన ఉద్దేశం అన్నారు. అయితే శారదా పీఠం కేవలం వైసీపీ పీఠం అని వ్యాఖ్యానించారు. అందుకు ప్రత్యక్ష నిదర్శనం.. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు శారదా పీఠానికి అధిక ప్రాధాన్యత ఇచ్చే వారని.. ప్రత్యేకంగా శారదా పీఠానికి వచ్చి స్వామీజీ ఆశీస్సులు పొందేవారన్నారు. జగన్ తన చెల్లిపై ప్రేమతోనే ఆస్తిలో షర్మిలకు వాటా ఇచ్చారు, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు కీలక వ్యాఖ్యలు
తీరా అధికారం కోల్పోయిన తర్వాత శారదాపీఠం వైపు కన్నెత్తి కూడా చూడడం లేదన్నారు. నిన్న విజయనగరం పర్యటన కోసం వచ్చిన వైయస్ జగన్ శారదా పీఠానికి రాకపోవడం అతని నిర్లక్ష్యానికి ప్రత్యక్ష ఉదాహరణ అని అన్నారు. వైసిపి ప్రభుత్వానికి ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పడంతో.. ఇప్పుడు ఆ వైసిపి నాయకులు కూడా ఇటువైపు కన్నెత్తి చూడడం లేదన్నారు.