Covid in AP: ఏపీలో తాజాగా 438 మందికి కరోనా, ఇద్దరు మృతితో 7,076కి చేరుకున్న మొత్తం మరణాల సంఖ్య, మొత్తం కోలుకున్న వారి సంఖ్య 8,67,445, యాక్టివ్‌ కేసులు 4,202
Coronavirus Outbreak (Photo Credits: IANS)

Amaravati, Dec 20: ఏపీలో తాజాగా మరో 438 కరోనా కేసులు (Covid in AP) నమోదు అయ్యాయి. కోవిడ్‌తో చిత్తూరు, నెల్లూరు జిల్లాలో ఒక్కొక్కరు మరణించారు. కాగా రాష్ట్రంలో గత 24 గంటల్లో 64,236 మందికి పరీక్షలు నిర్వహించారు. గడిచిన 24 గంటల్లో 589మంది కోవిడ్‌ నుంచి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు.

నేటి వరకూ రాష్ట్రంలో 1,12,60,810 మందికి పరీక్షలు నిర్వహించారు. ఇక మొత్తం కోలుకున్న వారి సంఖ్య 8,67,445కి చేరింది. తాజాగా మరో ఇద్దరు మృతితో మొత్తం మరణాలు7,076కి (Covid Deaths) చేరాయి. యాక్టివ్‌ కేసులు 4,202 ఉన్నాయి.

భారత్‌లో కోవిడ్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య (Coronavirus India) కోటి 30వేలు దాటాయి. గడిచిన 24 గంటల్లో 26,624 కొత్త పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా బారినపడిన వారి సంఖ్య 1,00,31,223కు చేరింది. శనివారం 341 మంది మృతి చెందగా ఇప్పటి వరకు 1,45,477 మంది ప్రాణాలు కోల్పోయారు.

షాక్..కరోనా వ్యాక్సిన్ తీసుకోగానే మూర్చపోయిన నర్సు, సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో

ఈ మేరకు ఆదివారం కేంద్ర వైద్యారోగ్యశాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. ఇక నిన్న 29,690 మంది డిశ్చార్జి అవ్వగా.. మొత్తం 95,80,402 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 3,05,344 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. రికవరీ రేటు 95.51గా ఉంది. మరణాల రేటు 1.45కు తగ్గగా.. యాక్టివ్‌ కేసుల శాతం 3.04గా ఉంది.