AP CM YS Jaganmohan Reddy | Photo Credits: ANI

Amaravati, Nov 19: ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు (AP Assembly Day 2) వాడి వేడిగా ముగిశాయి. వ్యవసాయ రంగంపై జరుగుతున్న చర్చ కాస్తా వ్యక్తిగత చర్చగా మారిపోయింది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు సభ నుంచి వెళ్లిపోయారు. మళ్లీ సీఎం గా గెలిచిన తరువాతనే అసెంబ్లీలో అడుగుపెడతానని శపధం చేశారు.ఈ గందరగోళం మద్య సీఎం (CM YS Jagan Mohan reddy) రెండు రోజు సమావేశంలో మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు (TDP Chief Chandrababu Naidu), టీడీపీ నేతల హైడ్రామాపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రజలు ఎలా పోయినా చంద్రబాబుకు పట్టదు.. తన రాజకీయ అజెండానే ఆయనకు ముఖ్యం అని అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. ‘‘ప్రతీ అంశాన్ని చంద్రబాబు రాజకీయం చేస్తారు. చంద్రబాబు ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నారనే విషయం రాష్ట్ర ప్రజలందరికి తెలుసు. నేను సభలోకి వచ్చేసరికి చంద్రబాబు ఎమోషనల్‌గా మాట్లాడుతున్నారు. చంద్రబాబు సంబంధంలేని విషయాలు తీసుకువచ్చి.. రెచ్చగొట్టారు. కానీ విపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా.. దేవుడి ఆశీస్సులు.. ప్రజల దీవెనలు ఉన్నంత కాలం మమ్మల్ని ఎవ్వరు కూడా అడ్డుకోలేరు’’ అని తెలిపారు.

వ్యవసాయ రంగంపై చర్చ, అనంతరం ఏపీ అసెంబ్లీ సమావేశాలు సోమవారానికి వాయిదా, సభ నుంచి వెళ్లిపోయిన చంద్రబాబు, మళ్లీ సీఎంగా గెలిచాకే అసెంబ్లీలో అడుగుపెడతానని శపథం

‘‘కుప్పం ప్రజలు కూడా చంద్రబాబును వ్యతిరేకించారు. శాసనమండలిలో కూడా టీడీపీ బలం పూర్తిగా పడిపోయింది. మండలి ఛైర్మన్‌గా దళితుడు, నా సోదరుడు మోషేన్‌రాజు ఈ రోజు బాధ్యతలు తీసుకుంటున్నారు. సభలో చంద్రబాబు కుటుంబ సభ్యుల గురించి ప్రస్తావన లేదు. మా అమ్మ, చెల్లెలు, బాబాయ్‌ గురించి చంద్రబాబే మాట్లాడారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5లాంటి మీడియా వ్యవస్థలు నాకు లేవు. తప్పుడు వార్తలు పదేపదే చెప్తే నిజం అవుతుందని అనుకుంటున్నారు. చంద్రబాబు కళ్లల్లో నీళ్లు లేకపోయినా నీళ్లు వచ్చాయని డ్రామా చేశారని సీఎం జగన్‌ అన్నారు.

వెక్కి వెక్కి ఏడ్చిన చంద్రబాబు, ముఖ్యమంత్రి అయితేనే అసెంబ్లీలో అడుగుపెడతానంటూ శపథం, నా భార్యను రాజకీయాల్లోకి లాగుతున్నారని ఆవేదన

‘‘మా చిన్నాన్న గురించి చంద్రబాబు మాట్లాడతాడు.. నా నాన్న తమ్ముడు నా చిన్నాన్న. ఒక కన్ను మరో కన్నును ఎందుకు పొడుచుకుంటుంది. నా చిన్నాన్నను ఎవరైనా ఏదైనా చేసుంటే వారే చేసుండాలి. వంగవీటి రంగ హత్య, మాధవరెడ్డి హత్య, చంద్రబాబు హయాంలోనే జరిగాయి. మల్లెల బాబ్జీ తన సూసైడ్‌ నోట్‌లో కూడా రాశారు’’ అని సీఎం జగన్‌ తెలిపారు. ‘‘వ్యవసాయంపై సభలో చర్చ సందర్భంగా విపక్షాలు లేకపోవడం బాధాకరం. ప్రతిపక్షం అంటే సూచనలు, సలహాలు ఇవ్వాలి. రైతు సంక్షేమం కోసం చాలా పథకాలు తీసుకువచ్చాం. వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చాం. గత ప్రభుత్వం మహిళలు, రైతులకు ఇచ్చిన హామీలను నేరవేర్చలేదు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నింటిని నేరవేర్చాం’’ అని సీఎం జగన్‌ తెలిపారు.

రైతుల చర్చలో విపక్ష సభ్యులు లేకపోవడం దురదృష్టకరమని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. వ్యవసాయ రంగంపై అసెంబ్లీలో సీఎం మాట్లాడుతూ.. వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామన్నారు. గత ప్రభుత్వం మహిళలు, రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో రైతుల సంక్షేమం కోసం చాలా సంక్షేమ పథకాలు తీసుకొచ్చామన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చుతున్నామని పేర్కొన్నారు.

వరద సహాయక చర్యలపై వర్యవేక్షణకు మూడు జిల్లాలకు ప్రత్యేక అధికారులు, ఐదు జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

గత ప్రభుత్వం పెట్టిన వడ్డీ లేనిరుణాల బకాయిలను కూడా తీర్చాం. ఆర్బీకేల ద్వారా వైఎస్సార్‌ యంత్రసేవా పథకం తెచ్చాం. తక్కువ ధరకు పనిముట్లు అద్దెకిచ్చేలా అందుబాటులోకి తెచ్చాం. విత్తు నుంచి కోత వరకు అవసరమైన యంత్ర పరికరాలు అందుబాటులో ఉంచాం. ఆర్బీకేల ద్వారానే ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు చేశాం. ప్రతి పార్లమెంట్‌ సెగ్మెంట్‌ పరిధిలో సెకండరీ ప్రాసెసింగ్‌ యూనిట్‌ తెస్తున్నాం. ఆర్బీకేల పరిధిలోనే గోడౌన్స్‌, కోల్‌రూమ్స్‌ ఏర్పాటు చేశాం. రూ.3వేల కోట్ల నిధులతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశామని’’ సీఎం వైఎస్‌ జగన్‌ అన్నారు.

‘‘రూ.2వేల కోట్లతో ప్రకృతి విపత్తు నిధిని ఏర్పాటు చేశాం. రూ.960 కోట్ల ధాన్యం సేకరణ బకాయిలు, రూ.9వేల కోట్ల విద్యుత్‌ బకాయిలు చెల్లించాం. పొగాకు రైతులు నష్టపోకుండా ఆదుకున్నాం. అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకుంటాం. రబీలో విత్తనాలు నాటిన రైతులనూ ఆదుకుంటాం. రబీలో నష్టపోయిన రైతులకు ఖరీఫ్‌ రాకముందే పరిహారం అందిస్తామని’’ సీఎం వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు.