Amaravathi, December 16: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఆరో రోజు (AP Assembly Winter Sessions 2019 Day-6) హాట్ హాట్ గా సాగుతున్నాయి. అసెంబ్లీలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య ఇళ్ల నిర్మాణంలో రివర్స్ టెండరింగ్ (Reverse Tendering Scheme), మద్యం పాలసీల (Debate on alcohol bans)పైన వాదోపవాదాలు నడుస్తున్నాయి. ఈ విషయం మీద మాటల యుద్ధం నడుస్తోంది.ఆంధ్రప్రదేశ్ శీతాకాల అసెంబ్లీ సమావేశంలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎవరేమన్నారో ఓ సారి పరిశీలిస్తే...
మంత్రి బోత్స సత్యనారాయణ
ఇళ్ల నిర్మాణంలో రివర్స్ టెండరింగ్‌తో రూ. 106 కోట్లు ప్రభుత్వానికి ఆదాయం వచ్చిందని మంత్రి బొత్స సత్యనారాయణ (Minister Botsa satyanarayana) తెలిపారు. టీడీపీ చేసిన దోపిడి వల్లే..రివర్స్ టెండరింగ్‌కు వెళ్లామని, అవసరమైతే టీడీపీ సభ్యులను కూడా పరిశీలనకు తీసుకెళుతామన్నారు. ఈ లెక్కన 3 లక్షల ఇళ్లకు రూ. 2 వేల 626 కోట్లు దోపిడి చేశారని, అవినీతిని సహించేది లేదని దాన్ని బయటపెట్టి తీరుతామని స్పష్టం చేశారు. హౌసింగ్ రెండు టెండర్లలో రివర్స్ టెండరింగ్‌కు వెళితే దాదాపు రూ. 150 కోట్లు ప్రభుత్వానికి ఆదాయం సమకూరిందన్నారు. గత ప్రభుత్వం హడావుడిగా ఇళ్ల నిర్మాణం చేపట్టిందని, ఐదేళ్లలో ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదని విమర్శించారు.
టీడీపీ సభ్యుడు అచ్చెన్నాయుడు
టీడీపీ మంత్రి అచ్చెన్నాయుడు (tdp mla achhennaidu) మాట్లాడుతూ...పేదల గృహ నిర్మాణానికి టీడీపీ (TDP)ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో లక్షలాది ఇళ్ల నిర్మాణం పూర్తయ్యాయని, ప్రభుత్వ రంగులు వేస్తే పేదలకు ఇళ్లు కేటాయించవచ్చని, ఆరు నెలలైనా ప్రభుత్వం దానిపై దృష్టి పెట్టలేదన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇళ్ల నిర్మాణంపై హౌస్ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. టీడీపీ హయాంలో పేదలకు నాణ్యమైన ఇళ్లు నిర్మించామని వైసీపీ వట్టి మాటలు చెబుతుందని అన్నారు. దీనిపై మేం తప్పు చేసినట్టు నిరూపిస్తే ఎలాంటి చర్యలకైనా సిద్ధమని ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అన్నారు.
ఎక్సైజ్ శాఖామంత్రి నారాయణ స్వామి
ఏపీ అసెంబ్లీలో మద్యనిషేదంపై చర్చ సందర్భంగా నారాయణస్వామి (Excise Minister Narayana Swamy) మాట్లాడుతూ.. మాజీ సీఎం చంద్రబాబుది మద్యం తాగు..తాగించు పాలసీ అని..సీఎం జగన్ ది మద్యం మాను..మాన్పించు పాలసీ అని ఎక్సైజ్ శాఖామంత్రి నారాయణ స్వామి అన్నారు. జగన్ సీఎం అధికారంలోకి వచ్చాక మద్యాన్ని నియంత్రించేలా పలు చర్యలు తీసుకున్నారనీ..విడతలవారీగా బెల్ట్ షాపులకు బంద్ చేస్తున్నారనీ తెలిపారు.
చంద్రబాబు సీఎంగా ఉన్న సయమంలో రాష్ట్రంలో మద్యం ఏరులైపారిందనీ, అటువంటి టీడీపీకి మద్య నిషేధంపై మాట్లాడే హక్కులేదన్నారు. మా ప్రభుత్వం మద్య నిషేధం చేస్తామని అంటుంటూ టీడీపీకీ ఎందుకంత కడుపు మంట? అని ప్రశ్నించారు. వచ్చే నాలుగేళ్లలో పూర్తిస్థాయిలో మద్యనిషేధం అమలు చేస్తామని మంత్రి నారాయణ స్వామి ఈ సందర్భంగా స్పష్టంచేశారు.
తెలుగుదేశం రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని
మద్యపాన నిషేధం అంశంపై తెలుగుదేశం రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని (TDP MLA Adireddy Bhavani ) మాట్లాడుతూ.. సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తామని మాట ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్ (AP CM YS Jagan అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మాటనే మర్చిపోయారని అన్నారు. మద్యం నియంత్రిస్తున్నట్లు చెబుతూ రేట్లు పెంచుకుని ఆదాయం తెచ్చుకుంటున్నారని ఆమె అన్నారు. వైసీపీ కార్యకర్తల నుంచి షాపులు అద్దకు తీసుకుని గతంలో ఇచ్చిన రేట్ల కంటే ఎక్కువగా రూ.20వేల నుంచి 50వేల వరకు అద్దెలు పెంచినట్లు ఆమె చెప్పారు.
మద్యం కొనడానికి వచ్చేవాళ్లు అన్ పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడుతున్నారని, డిగ్రీ చదువుకునే వాళ్ల చేత మందు అమ్మిస్తున్నారని, వాళ్లకు కంపెనీలు తెచ్చి ఉద్యోగాలు కల్పించకుండా ఇటువంటి పనులు చేయించడం కరెక్ట్ కాదని అన్నారు. అలాగే ప్రభుత్వానికి కమీషన్ ఎక్కువగా వచ్చే బ్రాండ్స్‌నే పెడుతున్నారని, రాష్ట్రంలో నాటుసారా బాగా పెరిగిపోయిందని, గంజాయి కూడా బాగా పెరిగిపోయిందన్నారు. ఇటువంటి విషయాలపై ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు.
తెలుగుదేశం ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు
మద్యపాన నిషేధం అంశంపై తెలుగుదేశం ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు (Palakollu MLA Nimmala Ramanaidu) అసెంబ్లీలో మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం బెల్టు షాపులు మాదిరి మొబైల్ మద్యం షాపులు వచ్చాయని విమర్శించారు. సంతలో కూరగాయలు అమ్మినట్లు మద్యం అమ్ముతున్నారని ఆరోపించారు. బ్రాందీ షాపుల నుంచి బారుల్లోకి మద్యం విచ్చలవిడిగా వెళ్తుందని అభిప్రాయపడ్డారు. మద్యం వాడకం తగ్గించడానికి రేట్లు పెంచినట్లు చెబుతున్న ప్రభుత్వం ఆర్టీసీ టిక్కెట్లను ఎందుకు పెంచిందో చెప్పాలని అన్నారు. మద్యం షాపుల కోసం రూ. 8వేలు కూడా అద్దె లేని వాటికి రూ.80వేల వరకు ప్రభుత్వం అద్దె చెల్లిస్తుందని రామానాయుడు అన్నారు.
తాడేపల్లి గూడెం వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ
గత టీడీపీ ప్రభుత్వంలో పేదల ఇళ్ల పేరుతో దోచుకున్నారని తాడేపల్లి గూడెం వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ (Tadepalligudem YSRCP MLA Kottu Satyanarayana) మండిపడ్డారు. తాడేపల్లి గూడెంలోనూ టీట్‌కో హౌసింగ్ కట్టించారని.. 300 చదరపు అడుగల ఇంటికోసం ఆరున్నర లక్షలు వసూలు చేశారని ధ్వజమెత్తారు. మూడున్నర లక్షలకు పైగా పేదలను అప్పుల పాలు చేశారన్నారు. చదరపు అడుగు నిర్మాణానికి ఎక్కడైనా వెయ్యి నుంచి 1200 వందలే ఉంటుందన్నారు.
ఇంటర్నేషనల్ టెక్నాలజీతో నిర్మాణం అన్నారని.. కానీ నిర్మాణంలో అన్నీ అవకతవకలే జరిగాయన్నారు. ఆ ఇళ్లలో మురుగు నీరు బయటకు వెళ్లే సదుపాయం లేదని, ఇటర్నేషనల్ టెక్నాలజీ పేరుతో పేదలపై అప్పుల భారం మోపారని కొట్టు సత్యనారాయణ మండిపడ్డారు. ఈ సందర్భంగా తాడేపల్లిగూడెంలో జిల్లా ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.