Amaravathi, December 16: రాష్ట్రంలో టెండర్లన్నీ రిజర్వు చేసుకుని రివర్స్ టెండరింగ్ పేరుతో అసత్యాలు చెబుతున్నారని వైసీపీ ప్రభుత్వం YCP GOVT)పై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu Naidu) మండిపడ్డ విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఏపీ అసెంబ్లీ (AP Assembly) నుంచి టీడీపీ (TDP)వాకౌట్ చేసింది. పేదల గృహ నిర్మాణంలో ప్రభుత్వం సరిగా సమాధానం లేదంటూ సభ నుంచి వాకౌట్ చేసింది. అనంతరం అసెంబ్లీ బయట అభివృద్ధిలో ఏపీ రాష్ట్రం (Andhra Pradesh) వెనక్కి వెళుతుందని, పాలన రివర్స్ లో జరుగుతుందంటూ టీడీపీ ర్యాలీ నిర్వహించింది. పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి చంద్రబాబు రివర్స్ లో నడుస్తూ ర్యాలీ చేపట్టారు.
ఈ సందర్బంగా ప్రభుత్వంపై విమర్శలు చేశారు చంద్రబాబు. టెండర్లన్నీ రిజర్వ్ చేశారని అన్నారు. అమరావతిలో రెండు లక్షల కోట్ల రూపాయల అభివృద్ధి పనులను ఆపేశారని అన్నారు. పెట్టుబడులు రావడం లేదని..అభివృద్ధి జరగడం లేదన్నారు. ఈ నిరసనలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సచివాలయం ఫైర్ స్టేషన్ నుంచి నిరసన ర్యాలీ చేపట్టారు. రివర్స్ పాలనవల్ల రాష్ట్రంలో ప్రజల సంక్షేమం, అభివృద్ధి నిలిచిపోయాయని వారు విమర్శలు గుప్పించారు.
రాష్ట్రంలో ఉన్మాది పాలన.. తుగ్లక్ పాలన నడుస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. బంగారు బాతు గుడ్డు పెట్టే బాతును పెంచుకోవాల్సింది పోయి దానిని చంపేసారని వ్యాఖ్యానించారు. అదే విధంగా ముందుగానే కంపెనీలతో ఒప్పందం చేసుకొని..రివర్స్ టెండరింగ్ పేరుతో రిజర్వ్ టెండరింగ్ కు పాల్పడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు.
ANI Tweet:
#WATCH Amaravati: TDP chief N Chandrababu Naidu along with other party workers stages a protest by walking backwards, against the state government alleging that govt is pushing the development works in the state backwards. #AndhraPradesh pic.twitter.com/wZoBkFMMGm
— ANI (@ANI) December 16, 2019
టీడీపీ నేత నారా లోకేశ్ నిరసన
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూటకో మాట మారుస్తోందంటూ టీడీపీ నేత నారా లోకేశ్ నిరసన తెలిపారు. ఏడు నెలల జగన్ గారి పాలనలో ప్రజల్ని ఇబ్బందులకు గురి చేసి ఏడిపించడం తప్ప సాధించింది ఏమీ లేదని అన్నారు. రివర్స్ పాలనవల్ల సంక్షేమం, అభివృద్ధి అటకెక్కాయని, ఉన్న సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశారని విమర్శించారు. పాదయాత్రలో హామీ ఇచ్చిన నవరత్నాలు అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్కొక్కటిగా రాలిపోతున్నాయి' అని నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రివర్స్ పాలన, రిజర్వుడు టెండరింగ్ ద్వారా సొంత మనుషులకు ప్రజాధనం దోపిడీని ఆపాలని అసెంబ్లీ ఎదురుగా రివర్స్ లో నడిచి నిరసన తెలిపామని నారా లోకేశ్ ట్వీట్ చేశారు.
అసెంబ్లీలో ఆమోదానికి రానున్న 13 బిల్లులు
ఇదిలా ఉంటే ఇవాళ అసెంబ్లీలో 13 బిల్లులకు ఆమోదం తెలపనున్నారు. ఎస్సీ కమిషన్ బిల్లు, ఎస్టీ కమిషన్ బిల్లు, ఎక్సైజ్ చట్టంలో సవరణలకు సంబందించి రెండు బిల్లులు, ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లుతో పాటు మొత్తం 13 బిల్లులకు ఆమోదం తెలపనున్నారు. అలాగే నూతన మద్యం విధానంపై స్వల్పకాలిక చర్చ జరగనుంది. కాగా అసెంబ్లీ సమావేశాలు ఆరు రోజులుగా జరుగుతున్నాయి. రోజుకో అంశంపై టీడీపీ ఆందోళనలు చేపడుతోంది. ఉల్లిధరలు, రైతుల సమస్యలు, 2430 జీవో, ఆర్టీసీ ఛార్జీల పెంపు, రివర్స్ టెండరింగ్ ఇలా కీలకమైన అంశాలపై నిరసన తెలియజేసింది. రోజుకో విధంగా వినూత్న రీతిలో చంద్రబాబు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మహిళలపై అత్యాచారం చేస్తే ఇకపై ఉరిశిక్షే, శాసనసభలో ఏపీ దిశ బిల్లుకు అమోదం
సీఆర్డీఏ పరిధిలో మొదటిసారి రివర్స్ టెండెరింగ్ నోటిఫికేషన్
ఏపీ ప్రభుత్వం సీఆర్డీఏ పరిధిలో మొదటిసారి రివర్స్ టెండెరింగ్ నోటిఫికేషన్ జారీ చేసింది. హ్యాపీ నెస్ట్ ప్రాజెక్ట్‌కు రివర్స్ టెండెరింగ్ నోటిఫికేషన్ విడుదలైంది. 2019, డిసెంబర్ 24 వ తేదీ వరకు బిడ్ల దాఖలుకు అవకాశం ఇచ్చారు. 2019, డిసెంబర్ 26వ తేదీన రివర్స్ టెండరింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. గతంలో హ్యాపీ నెస్ట్ ప్రాజెక్టును 658 కోట్లకు షాపుర్జీ సంస్థ దక్కించుకుంది. అమరావతిలోని నేలపాడు వద్ద 14.3 ఎకరాల్లో 2000 ఫ్లాట్లతో హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ నిర్మించనున్నారు.
రివర్స్ టెండరింగ్ విషయంలో ఏపీ ప్రభుత్వం వరుసుగా విజయాలు దక్కించుకుంటుంది. రివర్స్ టెండరింగ్ ద్వారా రాష్ట్రానికి మరికొంత ఆదాయం చేకూర్చుతామని ప్రభుత్వం తెబుతోంది. గత టీడీపీ ప్రభుత్వం హయాంలో చేపట్టిన ప్రాజెక్టుల విషయంలో వైసీపీ ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ కు వెళ్తున్న విషయం తెలిసిందే. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం నుంచి నవయుగ కంపెనీని తప్పించింది. గత ప్రభుత్వం ఆ కంపెనీతో చేసుకున్న ఒప్పందాన్ని ఏపీ సీఎం జగన్ రద్దు చేశారు.
మొదటి రోజు అసెంబ్లీ సమావేశంలో హైలెట్స్
సెటైర్లతో నవ్వులు పూయించిన ఆనం, అసెంబ్లీలో వల్లభనేని వంశీ
నేను 25 ఏళ్ళ యువకుడ్ని,మీరు నన్నేమి చేయలేరన్న చంద్రబాబు