Andhra pradesh Assembly Session for Three Capitals Confirmed on 20th(photo-PTI)

Amaravati, Sep 16: ఏపీ అసెంబ్లీ రెండో రోజు సమావేశాలు (AP Assembly Session 2022) ప్రారంభం అయ్యాయి. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా.. రెండో రోజు సభ ప్రారంభం కాగానే స్పీకర్‌ తమ్మినేని ప్రశ్నోత్తరాలు చేపట్టారు. కడప స్టీల్ ప్లాంట్ పై టీడీపీ ఇచ్చిన ప్రశ్నపై ప్రస్తుతం చర్చ కొనసాగింది. ఈ సందర్భంగా అధికార, ప్రతిపక్ష పార్టీ సభ్యుల మధ్య వాగ్వాదం జరుగుతోంది. జగన్ సీఎం అయి మూడేళ్లవుతున్నా ఇంత వరకు ప్లాంటు నిర్మాణాన్ని చేపట్టలేదని విమర్శించారు.

సొంత జిల్లాలోని ప్లాంటు నిర్మాణాన్ని కూడా ఆయన పట్టించుకోలేదని అన్నారు. ఈ సందర్భంగా మంత్రి బుగ్గన మాట్లాడుతూ... కరోనా వల్ల ప్రపంచమే కుదేలయిందని, స్టీల్ పరిశ్రమ పూర్తిగా డౌన్ అయిందని చెప్పారు. రెండేళ్లు కరోనాతోనే గడిచిపోయిందని అన్నారు. ఈ విషయాలు తెలుసుకోకుండా టీడీపీ సభ్యులు విమర్శించడం సరికాదని చెప్పారు. స్టీల్‌ ప్లాంట్‌ కోసం బడ్జెట్‌లో రూ. 250 కోట్లు పెట్టాం. 480 ఎకరాలకు రూ. 37 కోట్ల పరిహారం ఇచ్చాం. చట్టంలో ఏముందో టీడీపీ నేతలు చదివారా అని బుగ్గన తెలిపారు.

చంద్రబాబు అప్పుడు గాడిదలు కాశారా, అమరావతిపై నాకు ప్రేమ ఉండబట్టే శాసన రాజధాని చేశా, అసెంబ్లీలో సీఎం జగన్ స్పీచ్ హైలెట్స్ ఇవే..

పారిశ్రామికాభివృద్ధిని అడ్డుకునేందుకు టీడీపీ యత్నాలు. పరిశ్రమల ఏర్పాటుకు చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం. పరిశ్రమల గురించి మాట్లాడే అర్హత టీడీపీకి లేదు. బల్క్‌ డ్రగ్‌ పార్క్‌ వద్దంటూ లేఖ రాశారు. కడప స్టీల్‌ప్టాంట్‌ ఏర్పాటుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని గుడివాడ అమర్నాథ్‌ అన్నారు.

టీడీపీ హయాంలో దేవాలయాల అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారు. టీడీపీ హయాంలో 23 దేవాలయాలను కూలగొట్టారు. రూ. కోటికి పైగా ఖర్చు చేసి రథాన్ని తయారు చేశాం. రూ. 3 కోట్లతో రామతీర్థం ఆలయాన్ని పునరుద్ధరించాం. వైఎస్‌ జగన్‌ సీఎం అయ్యాక భక్తుల విశ్వాసాలను నిలబెట్టారు. చంద్రబాబు షూటింగ్‌ పిచ్చికి అమాయకులు బలయ్యారని కొట్టు సత్యానారాయణ తెలిపారు.

ప్రతి పౌరుడికి చౌకగా వైద్యం అందించేందుకు సీఎం జగన్‌ కృషి. వైద్యం కోసం ప్రజలు పక్క రాష్ట్రాలకు వెళ్లకూడదన్నదే ధ్యేయం.రాష్ట్రంలో కొత్తగా 17 మెడికల్‌ కాలేజ్‌లు ఏర్పాటు చేస్తున్నాం. మెడికల్‌ కాలేజ్‌ల పనులు వేగవంతంగా సాగుతున్నాయి. గత టీడీపీ హయాంలో ఒక్క మెడికల్‌ కాలేజ్‌నూ తీసుకురాలేదు. టీడీపీ హయాంలో దోచుకోవడం, దాచుకోవడం మాత్రమే జరిగిందని విడదల రజని అన్నారు.

మరోవైపు ఈరోజు ఎనిమిది బిల్లులను ప్రభుత్వం ప్రవేశ పెట్టనుంది. వీటిలో పంజాయతీరాజ్ సవరణ బిల్లు, రోడ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ సవరణ బిల్లు, సివిల్ సర్వీసెస్ రిపీల్ బిల్లు, ల్యాండ్ టైటిలింగ్ బిల్లు, యూనివర్శిటీల చట్ట సవరణ బిల్లు, ఇండియన్ స్టాంప్స్ సవరణ బిల్లు, ఆర్జీయూకేటీ సవరణ బిల్లు, అగ్రికల్చర్ అండ్ మార్కెటింగ్ సవరణ బిల్లు ఉన్నాయి.సోమవారం మధ్యాహ్నాం 12 గంటల ప్రాంతంలో డిప్యూటీ స్పీకర్‌ ఎన్నిక ఉంటుందని స్పీకర్‌ తమ్మినేని ప్రకటించారు.