Andhra Pradesh Assembly | Photo Credits : PTI

Amaravati, June 15: ఏపీలో బడ్జెట్ సమావేశాలకు సర్వం సిద్ధం అయింది. ఏపీ బడ్జెట్‌ సమావేశాలపై (AP Budget Session 2020) స్పీకర్‌ తమ్మినేని సీతారాం అధ్యక్షతన సోమవారం ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమీక్షలో అసెంబ్లీ నిర్వహణ, భద్రతపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. శాసన మండలి చైర్మన్ షరీఫ్‌, మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, డీజీపీ గౌతమ్ సవాంగ్, వైద్య శాఖ సెక్రటరీ జవహర్ రెడ్డి, చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి, విప్లు శ్రీనివాసులు, ఉదయభాను, కాపు రామచంద్రారెడ్డి, పోలీస్‌ ఉన్నతాధికారులు, పలు శాఖల అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కరోనా సోకిన గర్భిణికి సిజేరియన్‌, పుట్టిన పాపకు నెగిటివ్, ఊపిరి పీల్చుకున్న వైద్య సిబ్బంది, ఏపీలో తాజాగా 246 కోవిడ్-19 కేసులు నమోదు

ఈ సందర్భంగా స్పీకర్‌ తమ్మినేని సీతారాం (Tammineni Sitaram)మాట్లాడుతూ..కొవిడ్‌ నేపథ్యంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నామని, అసెంబ్లీ,మండలిలోని ప్రతి సీటును శానిటేషన్‌ చేస్తున్నామని తెలిపారు. సభ్యులందరికీ వైద్య పరీక్షలు నిర్వహించడానికి ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. భద్రతను కట్టు దిట్టం చేసి సభ్యులు మినహా ఎవ్వరిని అనుమతించకూడదని నిర్ణయం తీసుకున్నామని, గవర్నర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగిస్తారని వెల్లడించారు. శాసన సభ్యుల సిబ్బందికి బయట ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. భౌతిక దూరం పాటించి సమావేశాల నిర్వహణకు (AP Assembly session) ఏర్పాట్లు చేస్తున్నామని స్పీకర్‌ వెల్లడించారు.  కాణిపాకంలో కరోనా కలకలం, 2 రోజుల పాటు వినాయకుని గుడి మూసివేత, దర్శనాలు రద్దు, ఈ నెల 21వ తేదీన కనకదుర్గ ఆలయం మూసివేత

అసెంబ్లీ సమావేశాలను ప్రత్యేక పరిస్థితుల్లో నిర్వహిస్తున్నామని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో తొలిసారిగా ఇలా నిర్వహిస్తున్నామని వెల్లడించారు. రేపు ఉదయం 10 గంటలకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయన్నారు. గవర్నర్‌ ప్రసంగం అనంతరం బీఏసీ సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. సభ ఎన్ని రోజులు జరగాలన్నది బీఏసీలో నిర్ణయిస్తామని వెల్లడించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కరోనా పరీక్షలు నిర్వహించేందుకు వీలుగా ఏర్పాట్లు చేశామని శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. నేటి నుంచి కర్ణాటకకు ఏపీఎస్‌ఆర్టీసీ ఆన్‌లైన్ బుకింగ్, ముందుగా 168 బస్సు సర్వీసులతో ప్రారంభం, apsrtconline.in ద్వారా రిజర్వేషన్ చేసుకునే సదుపాయం

అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కోవిడ్‌ జాగ్రత్త చర్యలను సూచిస్తూ వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి రాష్ట్ర లెజిస్లేచర్‌ కార్యదర్శికి ప్రత్యేక నోట్‌ పంపించారు. ఆ నోట్‌ ఆధారంగా లెజిస్లేచర్‌ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు సూచనలు జారీ చేశారు.

లెజిస్లేచర్‌ కార్యదర్శి జారీ చేసిన సూచనలు

సభ్యులందరూ తప్పనిసరిగా అన్ని సమయాల్లో మాస్క్‌లు ధరించాలి. సభా మందిరంలోకి ప్రవేశించే ముందు శానిటైజర్లతో చేతులను శుభ్రపర్చుకోవాలి. సభా ప్రాంగణంలో ప్రవేశించే ముందుగానే ఉష్ణోగ్రతను తెలిపే థర్మల్‌ స్క్రీనింగ్‌ చేయించుకోవాలి. లాబీలు, గ్యాలరీల్లో సభ్యులు గుమిగూడకూడదు.

లిఫ్ట్‌లో ఇద్దరి కంటే ఎక్కువ ప్రయాణించకూడదు. సభా మందిరంలో సభ్యులు రెండు మీటర్ల భౌతిక దూరం పాటించాలి.

జ్వరం, దగ్గు, ఆయాసం, వాసన, రుచి కోల్పోవడం వంటి లక్షణాలు ఉన్నట్టు గుర్తిస్తే తప్పనిసరిగా వైద్య పరీక్షలు చేయించుకోవాలి.

60 ఏళ్ల వయసు దాటిన సభ్యులు, మధుమేహం, రక్తపోటు, గుండె, కిడ్నీ సంబంధిత వ్యాధులు ఉన్నవారికి కోవిడ్‌–19 వైరస్‌ సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల మరింత జాగ్రత్తగా ఉండాలి.

మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ పీఎస్‌లు, పీఏలు, పీఎస్‌వోలను తీసుకురాకూడదు. సందర్శకులను అనుమతించరు. అసెంబ్లీ ఆవరణలో ఆందోళనలకు అనుమతి లేదు.