Amaravati, Feb 27: ఏపీలో మూడు రాజధానుల అంశం కాక రేపుతోంది. విశాఖ రాజధానిగా ఉంటుందని వచ్చే నెల నాటికి అక్కడకు షిఫ్ట్ అవుతున్నామని సీఎం జగన్ పరోక్షంగా హింట్స్ ఇచ్చిన సంగతి విదితమే. ఇక ఏపీ హైకోర్టు గతంలో అమరావతే రాష్ట్ర రాజధాని తీర్పు వెలువరించిన సంగతి విదితమే. హైకోర్టు తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో (Supreme Court) సవాల్ చేసింది.
ఈ నేపథ్యంలో వచ్చే నెల 28వ తేదీన ఏపీ రాజధాని కేసు సుప్రీంకోర్టులో విచారణకు (AP Capital Hearing Row) రానుంది. ఏపీ రాజధాని కేసును త్వరగా విచారించాలని సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాది మెన్షన్ చేశారు. దీనిపై సుప్రీంకోర్టు విచారణ తేదీ ఇచ్చింది. ఈ కేసును జస్టిస్ కెఎం జోసెఫ్, జస్టిస్ నాగరత్నలతో కూడిన ధర్మాసనం విచారించనుంది.
మేం అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా.. ఏఐసీసీ 85వ ప్లీనరీలో కాంగ్రెస్ తీర్మానం
కాగా, గతేడాది నవంబర్‌లో అమరావతి రాజధాని కేసులో ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించిన సంగతి తెలిసిందే. గతంలో రాష్ట్ర ప్రభుత్వానికి రాజధానిని నిర్ణయించే అధికారం లేదన్న హైకోర్టు తీర్పును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేయగా, దానిపై సుప్రీంకోర్టు స్టే విధించింది. కాల పరిమితితో రాజధాని పూర్తి చేయాలన్న హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. దీనిలో భాగంగా రాజధాని ఇదే ప్రాంతంలో ఉండాలని ఒక రాష్ట్రాన్ని ఆదేశించలేం. ఒకే ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని రాష్ట్రానికి చెప్పలేం అని సుప్రీం పేర్కొంది.
రాష్ట్ర ప్రభుత్వానికి రాజధానిని నిర్ణయించే అధికారం లేదన్న హైకోర్టు తీర్పును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Govt) సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. హైకోర్టు తీర్పుపై స్టే విధించాలని ఏపీ ప్రభుత్వం పిటిషన్‌లో కోరింది. రద్దు చేసిన చట్టాలపై తీర్పు ఇవ్వడం సహేతుకం కాదని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.