Amaravati, June 1: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (AP CM YS Jagan Mohan Reddy) మంగళవారం ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. కోవిడ్ 19 (COVID-19) వ్యాప్తి నియంత్రణలో భాగంగా లాక్ డౌన్ 5 (Lockdown 5) విధించడంతో పలు అంశాలపై కేంద్ర హోంశాఖమంత్రి అమిత్ షాతో (Home Minister Amit Shah) సీఎం జగన్ భేటీ కానున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రంలో చేపట్టిన నివారణ చర్యలను, పెద్ద ఎత్తున నిర్వహించిన కరోనా పరీక్షల గురించి అమిత్ షాకు వివరించనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న కేసులు, ఏపీలో 3,571కు చేరిన కోవిడ్-19 కేసుల సంఖ్య, తెలంగాణలో 2,698కి చేరిన కరోనా కేసులు
లాక్‌డౌన్ కారణంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైన నేపథ్యంలో ఆయా అంశాలను కూడా అమిత్ షా దృష్టికి తీసుకురానున్నారు. వలస కూలీల తరలింపుతో పాటు రాష్ట్రానికి సంబంధించిన పలు విషయాలను వీరిద్దరు చర్చించనున్నారు. అలాగే కేంద్ర జలశక్తిమంత్రి గజేంద్ర షెకావత్‌ను కూడా సీఎం కలిసే అవకాశం ఉంది. తెలంగాణ ఏపీల మధ్య నీటి పంపకాల విషయంలో బేధాభిప్రాయాలు తలెత్తుతున్న నేపథ్యంలో దీనిపై ఆయనతో ఏపీ సీఏం చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
దాదాపు నాలుగు నెలల తర్వాత సీఎం జగన్ ఢిల్లీ వెళ్లబోతున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిమాణాలతో ఈ టూర్‌పై ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా గత జనవరిలో అభివృద్ధి వికేంద్రీకరణ, మూడు రాజధానుల బిల్లులు, మండలి రద్దు తర్వాత ఢిల్లీ వెళ్లారు. సెప్టెంబర్‌లో వెంటవెంటనే రెండు సార్లు ఢిల్లీ వెళ్లి.. కేంద్ర పెద్దలను కలిశారు. అప్పుడే హోంమంత్రి అమిత్ షాను కలిశారు. అయితే ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే ఢిల్లీ వెళ్లనున్నారు. సీఎంతో పాటు ఎంపీలు మిథున్ రెడ్డి, విజయసాయి రెడ్డిలు కూడా ఢిల్లీ వెళ్లబోతున్నారు.
ఇదిలా ఉంటే ఏపీ సీఎం వన్ ఇయర్ పాలనను పూర్తి చేసుకున్నారు. ఏడాదిలో ఎన్నికల్లో ఇచ్చిన వాగ్ధానాలను 90 శాతం నెరవేర్చి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. అమ్మఒడి, రైతు భరోసా, రివర్స్ టెండరింగ్, పరిశ్రమల్లో స్థానిక యువతకు 75శాతం ఉద్యోగాలు, రైతు భరోసా కేంద్రాలు, గ్రామ సచివాలయాలు, ఇలా ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఏడాదిలోనే దాదాపు 4 లక్షలకుపైగా ఉద్యోగాలు కల్పించామంటోంది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం. విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకోవడమే కాదు.. 90శాతం హామీలను నెరవేర్చింది. అంతేకాదు మేధోమథనం పేరుతో ప్రజలకు చేసిన మంచిని మన పాలన మీ సూచన అంటూ ఈ ఏడాది కాలంలో చేపట్టిన పథకాలు.. ప్రజలకు చేసిన మేలుపై చర్చించారు