CM YS Jagan Father-in-law Dies (Photo-Twitter)

Amaravati, Oct 3: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మామ, ప్రముఖ వైద్యులు ఈసీ గంగిరెడ్డి మృతి (EC gangi reddy) చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ.. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శుక్రవారం అర్ధరాత్రి మృతి (CM YS Jagan Father-in-law Dies) చెందారు. కాగా.. గంగిరెడ్డి సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి సతీమణి వైఎస్‌ భారతి తండ్రి (YS Bharati Father). ఆయన పులివెందులలో ప్రముఖ వైద్యులు. ఈయనకు పేదల డాక్టర్‌గా మంచి గుర్తింపు ఉంది. 2001-2005లో పులివెందుల ఎంపీపీగా కూడా పనిచేశారు. 2003లో రైతులకు రబీ విత్తనాల కోసం పులివెందుల నుంచి కడప కలెక్టరేట్ వరకూ ఈసీ గంగిరెడ్డి పాదయాత్ర చేశారు.

ఈసీ గంగిరెడ్డి మృతి చెందడంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పులివెందులకు చేరుకున్నారు. మధ్యాహ్నం జరగనున్న అంత్యక్రియల కోసం ఆయన పులవెందులకు చేరుకున్నారు. ఆయనను టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, కడప జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) ఎం.గౌతమి, సబ్ కలెక్టర్ పృథ్వితేజ్, డీఐజీ వెంకటరామిరెడ్డి తదితర అధికారులు విమానాశ్రయంలో సీఎం జగన్‌ను కలిశారు. సీఎం వైఎస్‌ జగన్‌ మామ ఈసీ గంగిరెడ్డి మృతిపట్ల వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి సంతాపం ప్రకటించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ.. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. డాక్టర్‌గానే కాక.. ఆయన ఒక మంచి నాయకుడిగా గుర్తింపు పొందారని ఈ సందర్భంగా ఆయన సేవలను విజయసాయి రెడ్డి గుర్తుచేసుకున్నారు.

ఘోర రోడ్డు ప్రమాదం, సంఘటన స్థలంలోనే ఆరుమంది దుర్మరణం, బెళగావి జిల్లాలో విషాద ఘటన, కూలి పనులు ముగించికుని తిరిగి వస్తుండగా ప్రమాదం

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తన ట్విటర్‌ ఖాతాలో.. 'ప్రజాసేవకు ఈసీ గంగిరెడ్డిగారు ఒక చిరునామా. ఆయన మరణం బాధాకరం. పేదలకు విశేషంగా వైద్యసేవలు అందించారాయన. ఎన్నో కుటుంబాల జీవన ప్రమాణాలను మెరుగుపరిచారు. పులివెందుల ప్రాంతం అభివృద్ధిలో ఆయనకు సుస్థిరస్థానం ఉంది. ఆయనకు నా ఘన నివాళి' అంటూ ట్వీట్‌ చేశారు.

ఈసీ గంగిరెడ్డి పార్థివ దేహానికి డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, మంత్రులు ఆదిమూలం సురేష్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు భూమన, శ్రీకాంత్‌రెడ్డి, తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి, ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, రవీంద్రనాథ్‌రెడ్డి, డీసీ గోవిందరెడ్డి, గౌతమ్‌రెడ్డి, ఆళ్లనాని నివాళర్పించారు.