Andhra Pradesh Cabinet Meet | File Photo

Amaravati, June 30: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన బుధవారం ఏపీ కేబినెట్‌ (AP Cabinet Meeting Highlights) జరిగింది. ఈ భేటీలో పలు ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. జులై 8న వైఎస్‌ఆర్‌ రైతు దినోత్సవం జరపాలని నిర్ణయించింది. అదే విధంగా... 100 ఇంటిగ్రేటెడ్‌ ఆక్వా ల్యాబ్‌ల ప్రారంభానికి ఆమోదం తెలిపింది. 640 కమ్యూనిటీ హైరింగ్‌ సెంటర్ల ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. దీంతో పాటుగా 45 కొత్త రైతు బజార్ల ఏర్పాటు, ఆర్‌బీకేల వద్ద గోడౌన్ల నిర్మాణానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

ఊటుకూరులో నాటుకోళ్ల హేచరీస్‌ ఏర్పాటుకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. అదే విధంగా... ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గంలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. సమాచార శాఖ మంత్రి పేర్ని కేబినెట్‌ నిర్ణయాలను (Andhra Pradesh cabinet meeting) మీడియాకు వెల్లడించారు. అలాగే తెలంగాణతో ఉన్న నీటి వివాదంపై (Krishna Water Dispute) మంత్రి అనిల్‌ కుమార్‌ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా... ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ (Telangana) వ్యవహరిస్తున్న తీరును ఆయన విమర్శించారు.

జలవివాదం..తెలంగాణ వైఖరిపై కేంద్రానికి లేఖ రాయాలని ఏపీ కేబినెట్ నిర్ణయం, రాష్ట్ర హక్కులకు సంబంధించి రాజీ పడేది లేదని స్పష్టం చేసిన జగన్ సర్కారు

నిబంధనలకు లోబడే నీటి ప్రాజెక్టులు నిర్మిస్తున్నామని ఆంధ్రప్రదేశ్‌ నీటి పారుదలశాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌ అన్నారు. రాష్ట్రానికి కేటాయించిన నీటిని మాత్రమే వాడుకుంటున్నామని స్పష్టం చేశారు. 848 అడుగులపైన ఉంటేనే పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లు తీసుకోగలం.. తెలంగాణకు 800 అడుగులపైనే నీళ్లు తీసుకునే అవకాశం ఉంది.. కృష్ణా బేసిన్‌లో 15 రోజులు మాత్రమే 880 అడుగులపైన నీటి లభ్యత ఉంటుంది. ఈ అంశాలన్నింటినీ అపెక్స్‌ కౌన్సిల్‌ దృష్టికి పలుమార్లు తీసుకెళ్లాం. ఇరిగేషన్‌ అవసరాల తర్వాతే విద్యుత్‌ ఉత్పత్తి చేయాలి. శ్రీశైలం డ్యామ్‌ నిండకూడదనే దుర్మార్గమైన చర్య జరుగుతుంది.

ఏపీలో కొత్తగా 3,797 కరోనా కేసులు, 5,498 మంది కోవిడ్‌ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్‌, రాష్ట్రంలో ప్రస్తుతం 38,338 యాక్టివ్‌ కేసులు

కేఆర్‌ఎంబీ ఆదేశాలు జారీ చేసినా తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు’’ అని మంత్రి అనిల్‌ కుమార్‌ ధ్వజమెత్తారు. ఇక తెలంగాణ వ్యవహారశైలిపై నేడే ప్రధాని మోదీకి, జలశక్తి మంత్రికి లేఖలు రాస్తున్నామన్న మంత్రి... రాష్ట్రప్రయోజనాల కోసం ఎంత దూరమైనా వెళ్తామని పునరుద్ఘాటించారు. ‘‘తెలంగాణ చర్యలను అడ్డుకుని తీరుతాం. అవసరమైతే ప్రాజెక్ట్‌లను కేంద్రం పరిధిలోకి తీసుకొచ్చేందుకు కూడా సిద్ధమే’’ అని స్పష్టం చేశారు. కాగా ఆంధ్రప్రదేశ్‌- తెలంగాణ జలవివాదంపై దృష్టి సారించిన ఏపీ కేబినెట్‌.. రాష్ట్ర హక్కులకు సంబంధించి రాజీ పడేదిలేదని స్పష్టం చేస్తూ తీర్మానం చేసింది.

కేబినెట్‌ నిర్ణయాలు

రూ.89 కోట్లతో మొబైల్‌ వెటర్నరీ అంబులెన్స్‌ల కొనుగోలుకు ఆమోదం

వైఎస్‌ఆర్‌ బీమా పథకానికి కేబినెట్‌ ఆమోదం

జులై 1,3,4 తేదీల్లో జగనన్న కాలనీల్లో నిర్మాణాలకు శంకుస్థాపన మహోత్సవం

ప్రతి ఇంటి నిర్మాణానికి రూ.లక్షా 80వేల ఆర్థికసాయం

మౌలిక వసతుల కల్పనకు రూ.34వేల కోట్లు ఖర్చు

ఇళ్లస్థలం పొందిన లబ్ధిదారులు వీలైనంత త్వరగా ఇళ్ల నిర్మాణం చేపట్టాలి..

నగదు వద్దనుకుంటే అమ్మఒడి ద్వారా ల్యాప్‌టాప్‌ పంపిణీకి ఆమోదం(ఇప్పటికే 35శాతం తల్లులు ల్యాప్‌టాప్‌లు కావాలని ప్రభుత్వాన్ని కోరిన నేపథ్యంలో.. మూడేళ్ల వారంటీతో ల్యాప్‌టాప్‌లు పంపిణీ)

రూ.339 కోట్లతో ఒంగోలు శివారులో ఆంధ్రకేసరి వర్శిటీ ఏర్పాటుకు ఆమోదం

విజయనగరం జేఎన్టీయూ ఇంజినీరింగ్‌ కళాశాలను వర్శిటీగా మార్పు

మధ్యతరగతి ప్రజల కోసం జగనన్న టౌన్‌షిప్‌ల ఏర్పాటుకు నిర్ణయం

నగరాలు, పట్టణాలకు దగ్గరలో ఉన్న స్థలాలు సేకరించి..

లాభాపేక్ష లేకుండా మధ్యతరగతి ప్రజలకు కేటాయించాలని నిర్ణయం

వ్యవసాయేతర ఆస్తులకు కూడా పట్టాదారు పాస్‌పుస్తకం ఇవ్వాలని నిర్ణయం

కాకినాడ సెజ్‌లో 2,180 ఎకరాల భూమిని రైతులకు తిరిగి ఇవ్వాలని నిర్ణయం

పీహెచ్‌సీలకు 539 కొత్త 104 వాహనాల కొనుగోలుకు ఆమోదం

2021-24 ఐటీ పాలసీకి కేబినెట్‌ ఆమోదం