Amaravati, May 6: రాష్ట్రంలో కోవిడ్-19 (Covid'19 in AP) నివారణా చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (AP CM YS Jagan) బుధవారం సమీక్ష నిర్వహించారు. వివిధ రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వలస కూలీలు (Migrant workers) అదే విధంగా రాష్ట్రంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన వలస కూలీల తరలింపు విధానాలపై ఈ సందర్భంగా అధికారులతో చర్చించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ జవహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఏపీలో 60, తెలంగాణలో 11 కొత్త కేసులు, రెండు తెలుగు రాష్ట్రాల్లో తెరుచుకున్న మద్యం షాపులు, తెలంగాణలో జోన్ల వివరాలు ఓ సారి తెలుసుకోండి
విదేశాల నుంచి పలువురు విమానాల్లో విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి ఎయిర్‌పోర్టులకు చేరుకుంటారని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. వారికి అక్కడే మెడికల్ స్క్రీనింగ్ చేయిస్తామని అనంతరం మార్గదర్శకాల ప్రకారం క్వారంటైన్ చేసి పర్యవేక్షణ కొనసాగిస్తామని వెల్లడించారు. ఆ తర్వాతే వారిని స్వస్థలాలకు పంపిస్తామని స్పష్టం చేశారు.
వలస కూలీల విషయంలో ఉదారంగా ఉండాలని సీఎం జగన్ అధికారులకు స్పష్టం చేశారు. ఏపీలో ఉన్న ఇతర రాష్ట్రాల కూలీలకు షెల్టర్ ఏర్పాటు చేసి వారికి భోజనం, తదితర సదుపాయాలు కల్పించాలని తెలిపారు. ఇక్కడ ఉంటానంటే పనులు కల్పించాలని. వెళతానంటే ప్రయాణ ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఇందుకు అవసరమైన ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. వెళ్లేటప్పుడు దారి ఖర్చుల కింద రూ.500లు రూపాయలు ఒక్కో కూలీకి ఇవ్వండి’’ అని సీఎం జగన్ అధికారులకు సూచించారు. ఆరు రాష్ట్రాల్లో కరోనా విలయతాండవం, 50 వేలకు చేరువలో కరోనా కేసులు, దేశ వ్యాప్తంగా 1,694 మంది మృతి, 33,514 కరోనా యాక్టివ్ కేసులు
మహారాష్ట్రలోని థానే నుంచి 1000 మందికి పైగా వలసకూలీలు గుంతకల్ వచ్చారని ఈ సంధర్భంగా అధికారులు సీఎం జగన్‌కు తెలిపారు. వీరందరికీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. అలాగే లాక్‌డౌన్ నేపథ్యంలో సరిహద్దుల్లో 9 చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
కోవిడ్-19 కేసుల డిశ్చార్జిలో దేశ సగటు 28.63 శాతం అయితే రాష్ట్రంలో 41.02 శాతం.. అలాగే పాజిటివిటీ రేటు రాష్ట్రంలో 1.26 శాతం అయితే దేశంలో 3.87 శాతం ఉందని వెల్లడించారు. ఇక టెలి మెడిసిన్‌లో భాగంగా సబ్ సెంటర్లకు మందులు పంపించి... డాక్టర్ల ఇచ్చిన ప్రిస్కిప్షన్ మేరకు వారికి పంపిణీ చేస్తున్నామని అధికారులు స్పష్టం చేశారు. రైతులకు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని... వారికి ఎక్కడ సమస్యలు ఎదురైనా వెంటనే స్పందించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. సమస్యలను పరిష్కరించడంలో దూకుడు ప్రదర్శించాలని పేర్కొన్నారు.
Here's CMO Andhra Pradesh Tweet
క్యాంపు కార్యాలయంలో మత్స్యకార భరోసా కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం శ్రీ వైయస్.జగన్.
కరోనాతో పోరాడుతున్న సమయంలో కూడా, ఇన్ని కష్టాలు ఉన్నా సరే.. మనకున్న కష్టాలకన్నా మత్స్యకారుల కష్టాలు పెద్దవి అని భావించి ఇవాళ మత్స్యకార భరోసాను మరోసారి ఇస్తున్నాం: సీఎం pic.twitter.com/CfMpJNOCFL
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) May 6, 2020
వైఎస్సార్ మత్స్యకార భరోసా
లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన మత్స్యకారులను ఆదుకునేందుకు వైఎస్సార్ మత్స్యకార భరోసా కింద వేట నిషేధ భృతి చెల్లింపులను బుధవారం సీఎం వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు.ఈ పథకం కింద మత్స్యకారుల ఖాతాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ. 10 వేలు జమ చేయనుంది. దీంతో మొత్తం లక్షాల 9 వేల 231 మంది లభ్దిదారులకు ప్రయోజనం చేకూరుతుంది. గతంలో మత్స్యకారుల విరామ భృతి 4 వేలు ఉండగా.. సీఎం వైఎస్ జగన్ దానిని 10 వేలకు పెంచిన సంగతి తెలిసిందే.