AP CM YS Jagan| ( File Photo)

Amaravati, August 3: రాఖీ పౌర్ణమి (Raksha Bandhan) సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (Chief Minister YS Jagan Mohan Reddy) రాష్ట్రంలోని అక్కాచెల్లెమ్మలు అందరికీ శుభాకాంక్షలు (CM Jagan Raksha Bandhan Greetings) తెలిపారు. తోబుట్టువుల మధ్య ప్రేమానుబంధాలకు ప్రతీకగా నిలిచే పండుగ రక్షాబంధన్‌ అని, ఒకరికి ఒకరు రక్షణగా ఉంటామని బాస చేసుకునే పర్వదినం అని పేర్కొన్నారు. కరోనా మహమ్మారి వ్యాపిస్తున్న నేపథ్యంలో రాఖీ పండుగ స్ఫూర్తిని కొనసాగిస్తూ, అంతా క్షేమంగా ఉండాలని ఆకాంక్షించారు. ఏపీకి వచ్చేవారికి ఇకపై నో కండీషన్స్, ఆటోమేటిక్ ఈ పాస్ సిస్టంను ప్రవేశపెట్టిన ఏపీ సర్కారు, స్పందనలో నమోదు చేసుకుంటే తక్షణమే ఈ పాస్

ఈ మేరకు.. ‘‘రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నా ప్రియమైన అక్కాచెల్లెమ్మలకు శుభాభినందనలు’’ అని సోమవారం ఆయన ట్వీట్‌ చేశారు. మహిళల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన సీఎం జగన్‌, రాఖీ పండుగ సందర్భంగా సైబర్ నేరగాళ్ల వలలో పడకుండా మహిళలకు అవగాహన కార్యక్రమాలు చేపట్టన సంగతి తెలిసిందే.

Here's AP CM Jagan Raksha Bandhan Greetings

రక్షా బంధన్‌ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఇది సోదర సోదరీమణుల మధ్య బంధాన్ని ప్రతిబింబించే పండుగని పేర్కొన్నారు. మహిళలను రక్షించాలనే సంకల్పాన్ని పునరుద్ఘాటించడం, వారి సంక్షేమం కోరుకోవడమే ఈ పండుగ స్ఫూర్తి అని వ్యాఖ్యానించారు. ఈ మేరకు సీఎంవో అధికారులు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.

నేడు ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ పుట్టిన రోజు సంధర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. గవర్నర్‌కు ఫోన్‌ చేసి సీఎం జగన్‌ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. దేవుడు ఆయురారోగ్యాలను ప్రసాదించాలని, మీ జీవితంలో సంతోషం నింపాలని కోరుకుంటున్నానంటూ సీఎం ఆయనకు తెలిపారు.

AP CM Birthday wishes to Governor

ఇదిలా ఉంటే రాఖీ పౌర్ణమి సందర్భంగా దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి విగ్రహానికి పలు ప్రాంతాల్లో మహిళలు రాఖీలు కట్టి అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.