coronavirus scare in india (Photo-PTI)

Amaravati, July 9: ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1555 పాజిటివ్‌ కేసులు (AP Coronavirus) నమోదయ్యాయి. గత 24 గంటల్లో 13 మంది మృతిచెందారు. కొత్తగా నమోదైన కేసుల్లో ఏపీకి చెందినవారు 1500 మంది, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారిలో 53 మంది, విదేశాల నుంచి వచ్చిన వారిలో ఇద్దరు ( Andhra Pradesh) ఉన్నారు. ఏపీలో ఇప్పటి వరకు మొత్తం 23,814 పాజిటివ్‌ కేసులు నమోదుకాగా.. 277 మంది మృతి చెందారు. వివిధ ఆస్పత్రులలో 10,544 చికిత్స పొందుతున్నారు. 10,250 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. చనిపోయిన ఆవును తిని 70 మంది ఆస్పత్రి పాలు, ఆరుగురి పరిస్థితి విషమం, బాధితులను పరామర్శించిన పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మీ, విశాఖ మన్యంలో ఘటన

గడిచిన 24 గంటల్లో 904 మంది కోవిడ్‌ నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్‌ అయ్యారు. ఇక కరోనా కారణంగా కర్నూలు జిల్లాలో ముగ్గురు, గుంటూరులో ముగ్గురు, అనంతపూర్‌లో ఇద్దరు, ప్రకాశంలో ఇద్దరు, కృష్ణలో ఒక్కరు, పశ్చిమ గోదావరిలో ఒక్కరు, చిత్తూరులో ఒక్కరు మరణించారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ గురువారం హెల్త్‌బులెటిన్‌ విడుదల చేసింది. కాగా రాష్ట్రంలో ఇప్పటివరకు 10,94,615 శాంపిల్స్‌ పరీక్షించారు. గడిచిన 24 గంటల్లో 16,882 మందికి పరీక్షలు నిర్వహించారు.

కృష్ణా జిల్లా గుడివాడ డివిజన్ పరిధిలో నేటి వరకూ 32 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని ఆర్డీవో శ్రీను కుమార్ తెలిపారు. ఇంకా కొన్ని పరీక్షల రిపోర్టులు రావాల్సి ఉందని ఆర్డీవో తెలిపారు.నెల్లూరు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. జిల్లాలో ఇప్పటి వరకు 1201 మంది కరోనా బారిన పడ్డారు. ఇప్పటికే 23 మంది మృతి చెందారు. జిల్లాలో కేసులు పెరుగుతూ ఉండటంతో పలు బ్యాంకులు, కార్యాలయాలు మూతపడ్డాయి. సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యకి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం ఆయన ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యే సంజీవయ్య నెల్లూరులోని నారాయణ హాస్పిటల్ లో ఉన్నారు. ఆరోగ్యశ్రీ ఉంటే కరోనా సేవలు ఉచితం, మందుల ఖర్చు ప్రభుత్వమే భరిస్తుంది, ఏపీలో ప్రైవేట్ అస్పత్రులకు కోవిడ్-19 ఫీజులను నిర్ణయించిన ప్రభుత్వం

ఏపీలో రోజురోజుకు కేసులు పెరుగుతుండడంతో నేటి నుంచి క్యాంపు కార్యాయాలు మూసివేయాలని స్పీకర్, మంత్రి నిర్ణయం తీసుకున్నారు. మంత్రి ధర్మాన కృష్ణ‌దాస్, స్పీకర్ తమ్మినేని సీతారాం క్యాంపు కార్యాలయాలు నేటి నుంచి మూసివేశారు. గురువారం నుంచి తమని కలిసేందుకు 15 రోజులు వరకు ఎవరూ రావద్దని ప్రకటన విడుదల చేశారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

Here's AP Corona Report

ప్రకాశం జిల్లాలో తాజాగా మరో 110 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఇప్పటి వరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1196కు చేరింది. నిన్న అత్యధికంగా ఒంగోలులో 34, మార్కాపురం 17, పామూరు 13 సహా జిల్లాలోని పలు ప్రాంతాల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. నిన్న కరోనాతో ఓ వైద్య, ఆరోగ్య శాఖ ఉద్యోగి సహా ముగ్గురు మృతి చెందారు. జిల్లాలో ఇప్పటి వరకు కరోనాతో 24 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు కరోనా నిర్ధారణ కోసం 94,284 శ్యాంపిళ్లు పంపారు. వాటిలో 88,510 నెగిటివ్ ఫలితాలు రాగా...ఇంకా 4691 రిపోర్టులు రావాల్సి ఉంది. జిల్లా వ్యాప్తంగా 705 మంది క్వారంటైన్లలో ఉన్నారు. ఇప్పటి వరకు కరోనా బారి నుండి కోలుకుని 607 మంది డిశ్చార్జ్ అవగా...జిల్లాలో ప్రస్తుతం 589 యాక్టివ్ కేసులు ఉన్నాయి.