
Amaravati, April 22: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో (AP Corona Pandemic) గడిచిన 24 గంటల్లో కొత్తగా 56 కరోనా(Covid-19) పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా (Coronavirus) బాధితుల సంఖ్య 813కు చేరింది. వీరిలో చికిత్స అనంతరం 120 మంది డిశ్చార్జ్ కాగా, మొత్తంగా 24 మంది మరణించారు. ఇక కరోనావైరస్ బారిన పడి ప్రస్తుతం 669 మంది చికిత్స పొందుతున్నారు.
ఏపీలో రోజురోజుకూ పెరుగుతున్న పరీక్షా సామర్థ్యం
జిల్లాల వారీ వివరాల ప్రకారం గత 24 గంటల్లో చిత్తూరులో 6, గుంటూరులో 19, కడపలో 5, క్రిష్ణాలో 3, కర్నూలులో 19, ప్రకాశంలో 4 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం (Government of Andhra Pradesh) బుధవారం నాటి కేసులకు సంబంధించిన మీడియా బులెటిన్‌ను విడుదల చేసింది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 5757 నమూనాలు పరీక్షించగా 56 మందికి పాజిటివ్‌గా తేలింది.
గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో మొత్తంగా 24 మంది కోవిడ్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. గుంటూరు- 8, అనంతపూర్- 5, కడప- 4, నెల్లూరు- 4, కృష్ణ- 2, విశాఖపట్నం- 1 కొత్తగా గుంటూరు జిల్లాలో రెండు మరణాలు నమోదయ్యాయి.
Here's AP Corona Update
#CovidUpdates: రాష్ట్రంలో గత 24 గంటల్లో జరిగిన కోవిడ్19 పరీక్షల్లో 56 కేసు లు పాజిటివ్ గా నమోదయ్యాయి.
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 813 పాజిటివ్ కేసు లకు గాను 120 మంది డిశ్చార్జ్ కాగా, 24 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 669. #APFightsCorona pic.twitter.com/fMSjT6d2RX
— ArogyaAndhra (@ArogyaAndhra) April 22, 2020
ఇదిలా ఉంటే పలమనేరు పట్టణానికి చెందిన 18మంది వ్యాపారులు నాలుగు రోజుల కిందట పెద్దపంజాణి మండలం రాయలపేటకు చెందిన ఓ యువకుడి నుంచి ఉప్పు బస్తాలను కొన్నారు. అతనికి పలమనేరు ట్రూనాట్‌లో గురువారం నిర్వహించిన పరీక్షలో కరోనా లక్షణాలున్నట్టు గుర్తించారు. తదుపరి పరీక్షల నిమిత్తం రెండు రోజుల కిందట తిరుపతికి తరలించారు. విషయం తెలుసుకున్న స్థానిక వ్యాపారుల్లో ఆందోళన ప్రారంభమైంది. ఎందుకైనా మంచిదని తాము కూడా కరోనా పరీక్షలు చేయించుకుంటామంటూ సిద్ధపడ్డారు.
640మంది కరోనాతో మృతి, ఇండియాలో 19 వేలు దాటిన కరోనా కేసులు, ఒక్కరోజులోనే 1883 కేసులు నమోదు
వాలంటీర్ల పనితీరుకు గానూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వారికి రూ.50 లక్షల భీమా సదుపాయం కల్పించేందుకు సిద్ధమైంది. ఈమేరకు వైద్య ఆరోగ్య శాఖ పంచాయతీ రాజ్ శాఖకు మంగళవారం సర్క్యులర్ జారీ చేసింది. గ్రామ, వార్డు వలంటీర్లకూ 'ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ ' ప్యాకేజీ వర్తింపజేయాలని నిర్ణయించినట్టు పేర్కొంది. రాష్ట్రంలో ఉన్న రెండు లక్షల 60 వేల మంది వలంటీర్లకు పీఎంజీకే ప్యాకేజీ కింద రూ.50 లక్షల బీమా వర్తించనుంది. మూడు విడతల కొవిడ్-19 ఇంటింటి సర్వేలో పాల్గొన్న వలంటీర్లు పాజిటివ్ వ్యక్తులతో కాంటాక్ట్ అయ్యే అవకాశమున్నందున ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నిర్ణయంపై వలంటీర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.