Coronavirus Spread (Photo Credit: IANS)

Amaravati, June 26: ఏపీ కరోనా కేసుల తాజా బులెటిన్‌ను (AP Corona Update) రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తాజాగా విడుదల చేసింది. గత 24 గంటల్లో 605 కేసులు (COVID-19 cases) నమోదు అయ్యాయి. వీరిలో రాష్ట్రానికి చెందిన వారు 570 మంది కాగా, ఇతర రాష్ట్రాలకు చెందిన వారు 34 మంది, విదేశాలకు చెందిన వారు ఒకరు ఉన్నారు. మొత్తం 10 మంది చనిపోగా.. కర్నూల్ జిల్లాకు చెందిన వారు నలుగురు, కృష్ణా జిల్లాకు చెందిన వారు నలుగురు, గుంటూరులో ఒకరు, విశాఖలో ఒకరు మృతి (Corona Virus Deaths) చెందారు.ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 11, 489 కేసులు నమోదు కాగా, 6147 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని, 5196 మంది డిశ్చార్జ్ అయ్యారని రికార్డులు చెబుతున్నాయి. మొత్తం 146 మంది చనిపోయారు. కరోనా భారీన మరో వైసీపీ ఎమ్మెల్యే, కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్‌ సుధాకర్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ, ఐసోలేషన్‌ వార్డుకు తరలించేందుకు ఏర్పాట్లు

గత 24 గంటల్లో 22,305 శాంపిల్స్‌ను పరీక్షించగా 605 మందికి వైరస్‌ నిర్ధారణ అయింది. కర్నూల్‌, కృష్ణలలో నలుగురు చొప్పున, గుంటూరు, విశాఖపట్నంలో ఒక్కరు చొప్పున మృత్యువాత పడగా.. 191మంది కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. ఇప్పటివరకు 7,91,624 శాంపిల్స్‌ పరీక్షించగా ఆంధ్రప్రదేశ్‌నుంచి 9353, ఇతర రాష్ట్రాల నుంచి 1764, ఇతర దేశాల నుంచి వచ్చిన 372 మందికి కరోనా నిర్థారణ అయింది.

Here's AP Corona Report

కాగా సచివాలయంలో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. సీఎం కార్యాలయం ఉండే మొదటి బ్లాక్‌లో ఓ ఉద్యోగికి కరోనా అని తేలింది. జీఏడీలో డీఈవోగా పనిచేస్తున్న ఉద్యోగికి కరోనా సోకింది. అలాగే మూడో బ్లాక్‌లో మరో ఉద్యోగికి కరోనా తేలింది. కరోనా కల్లోలానికి తిరునల్వేలి హల్వా యజమాని ఆత్మహత్య, దేశంలో రికార్డు స్థాయిలో 17,296 కేసులు నమోదు, 5 లక్షలకు చేరువలో కోవిడ్-19 కేసులు

తాజాగా కర్నూలు జిల్లా కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్‌ సుధాకర్‌కు గురువారం కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. రెండు రోజులుగా తీవ్ర జ్వరంతో ఆయన హోమ్‌క్వారంటైన్‌లో ఉన్నారు. కె.నాగలాపురం దగ్గర ఉన్న విశ్వభారతి ఆస్పత్రిలోని ఐసోలేషన్‌ వార్డుకు ఎమ్మెల్యేను తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా తెలంగాణలోనూ పలువురు ఎమ్మెల్యేలు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే.