Amaravati, June 2: ఏపీలో (AP Coronavirus) గడిచిన 24 గంటల్లో 12,613 కరోనా పరీక్షలు నిర్వహించగా 82 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 40 మంది కరోనా నుంచి కోలుకొని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. దీంతో ఇప్పటి వరకు డిశ్చార్జి అయిన వారి సంఖ్య 2209 చేరింది. కాగా సోమవారం ఒక్క మరణం కూడా సంభవించలేదు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంగళవారం కరోనాపై హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 3,200 కరోనా కేసులు నమోదవ్వగా, 64 మంది మృతి చెందారు. ప్రస్తుతం 927 మంది వివిధ కోవిడ్ ఆసుపత్రిల్లో చికిత్స పొందుతున్నారు. ఏసీ బస్సులు వచ్చేస్తున్నాయ్, రాయలసీమ టూ వైజాగ్ వరకు ఇంద్ర బస్సులను నడపాలని ఏపీ సర్కారు నిర్ణయం, ఆదరణ కోల్పోతున్న పల్లెవెలుగు
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (AP CM YS Jagan) నేటి ఢిల్లీ పర్యటన వాయిదా పడింది. లాక్‌డౌన్ కారణంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమైన నేపథ్యంలో ఆయా అంశాలను కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో, పోలవరం నిధుల గురించి కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్ర షెకావత్‌తో చర్చించాలని సీఎం వైఎస్ జగన్ భావించారు. షెడ్యుల్ ప్రకారం తాడేపల్లి నుంచి మంగళవారం ఉదయం 10 గంటలకు సీఎం బయలుదేరి వెళ్లాల్సి ఉండగా, ఈ పర్యటన వాయిదా పడింది.
వలస కూలీల తరలింపుతో పాటు రాష్ట్రానికి సంబంధించిన పలు విషయాలను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అనుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఎప్పుడు వెళతారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. త్వరలోనే ఢిల్లీ వెళ్లే అవకాశం ఉంది.