Amaravati, August 20: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 9,393 మందికి (COVID 19 Cases) పాజిటివ్‌గా తేలింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,25,396కు (AP Coronavirus Update) చేరింది. 55,551 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. తాజాగా వైరస్ నుంచి 8,846 మంది రోగులు కోలుకుని డిశ్చార్జ్ కాగా, మొత్తం 2,35,218 మంది కోలుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 24 గంటల్లో 95 మంది మృత్యువాత పడగా ఇప్పటి వరకు మొత్తం 3001 మంది మరణించారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ గురువారం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 30,74,847 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశామని వైద్యారోగ్యశాఖ తెలిపింది.
24 గంటల్లో చిత్తూరులో- 16, ప్రకాశంలో- 11 , నెల్లూరులో- 09 , అనంతపురంలో-08, తూర్పుగోదావరిలో-08, పశ్చిమ గోదావరిలో-08, కడపలో- 07, గుంటూరులో-06, కర్నూల్‌లో-06, విశాఖపట్నంలో- 06, శ్రీకాకుళంలో-05, విజయనగరంలో-03, కృష్ణాలో- 2 మరణాలు సంభవించాయి. వినాయక చవితి ఉత్సవాలపై ఏపీ ప్రభుత్వం ఆదేశాలు, బహిరంగ వేడుకలు నిషిద్ధం, ఇంట్లోనే జరుపుకోవాలని సర్కారు వినతి
కోవిడ్ మహమ్మారి బంధాలను విచ్ఛిన్నం చేస్తోంది. అనంతపురం నగరంలో అటువంటి దయనీయమైన ఘటన ఒకటి చోటు చేసుకుంది. నగరంలోని హౌసింగ్ బోర్డులో నివాసముండే మాజీ సైనికుడు అబ్దుల్ రజాక్ కరోనా కోరలకు చిక్కి వారం క్రితమే ప్రాణాలు వదిలారు. వైరస్ బారిన పడిన ఆయన భార్య షేక్ గౌసియా కూడా తాజాగా బుధవారం మృత్యువాత పడింది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు షేక్ అర్షద్, షేక్ షబ్నం. షబ్నం దుబాయ్‌లో ఉంటోంది. అర్షద్ ఇంటి వద్దే సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్నాడు. కూతురు దుబాయ్‌లో ఉండడంతో తల్లిదండ్రుల కడసారి చూపులకు నోచుకోలేదు.