Coronavirus outbreak | (Photo Credits: IANS)

Amaravati, April 13: ఏపీలో గడచిన 24 గంటల్లో 4 వేల మందికి కరోనా నిర్ధారణ అయింది. 35,582 కరోనా పరీక్షలు నిర్వహించగా 4,228 మందికి పాజిటివ్ (AP Coronavirus) అని వెల్లడైంది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 842 కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో 622, తూర్పు గోదావరి జిల్లాలో 538, విశాఖ జిల్లాలో 414 కేసులు గుర్తించారు.

పశ్చిమ గోదావరి జిల్లాలో 48, కర్నూలు జిల్లాలో 88 కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 1,483 మంది కరోనా నుంచి కోలుకోగా, 10 మంది మరణించారు. ఒక్క చిత్తూరు జిల్లాలోనే నలుగురు కన్నుమూశారు. ఏపీలో ఇప్పటివరకు 9,32,892 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,99,721 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 25,850 మంది చికిత్స పొందుతున్నారు. మొత్తం మరణాల సంఖ్య 7,321కి చేరింది.

రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కరోనా వ్యాక్సిన్ డోస్‌లను తమ రాష్ట్రానికి పంపించాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ నిమిత్తం సోమవారం 4.40 లక్షల కోవిషీల్డ్‌ టీకా డోసులు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చేరుకున్నాయి. ఎయిరిండియాకు చెందిన ఏఐ 467 విమానంలో 37 బాక్స్‌లలో ప్రత్యేకంగా భద్రపరిచిన వ్యాక్సిన్‌ను ఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయానికి తరలించారు.

గుట్టలు గుట్టలుగా కరోనా శవాలు, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఒళ్లు గగుర్పొడిచే ఘటన, ఈ నెల 17 తర్వాత లాక్‌డౌన్ దిశగా కర్ణాటక, లాక్‌డౌన్ నిబంధనలు కఠినం చేయడంతో మహారాష్ట్రలో తగ్గుతున్న కోవిడ్ కేసులు, దేశంలో తాజాగా 1,61,736 మందికి కరోనా నిర్ధారణ

అనంతరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి ప్రత్యేక ఏసీ కంటైనర్‌లో గన్నవరం ప్రభుత్వాసుపత్రి ఆవరణలో ఉన్న రాష్ట్ర వ్యాధి నిరోధక టీకాల భవనానికి తరలించారు. అక్కడి నుంచి రాత్రికి 13 జిల్లాల్లోని టీకా స్టోరేజ్‌ సెంటర్లకు వ్యాక్సిన్‌ను తరలించేందుకు అధికారులు సన్నాహాలు చేపట్టారు.