Amaravati, Oct 24: ఏపీలో రికార్డు స్థాయిలో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటివరకు రికార్డుస్థాయిలో 75,02,933 సాంపిల్స్ పరీక్షించినట్లు అధికారులు తెలిపారు. గడిచిన 24 గంటల్లో 74,919 మందికి కరోనా సాంపిల్స్ పరీక్షించగా.. 3,342 మందికి (AP Coronavirus Report) కోవిడ్ పాజిటివ్‌గా నిర్థారణ అయింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,04,026కు (Covid Cases in AP) చేరుకుంది.
కరోనా నుంచి కొత్తగా 3,572 మంది కోలుకోగా.. మొత్తం డిశ్చార్జి అయినవారి సంఖ్య 7,65,991గా ఉంది. గత 24 గంటల్లో కొత్తగా 22 మంది మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 6,566కు (Covid Deaths) చేరింది. ఏపీలో ప్రస్తుతం 31,469 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ రేటు 10.72శాతంగా ఉండగా... ప్రతి మిలియన్ జనాభాకు 1,40,504 పరీక్షలు చేస్తున్నారు.
గడిచిన 24 గంటల్లో కరోనాతో చిత్తూరు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో నలుగురు చొప్పున మృతి చెందారు. అనంతపురం, తూర్పుగోదావరి, విశాఖ జిల్లాల్లో ఇద్దరు చొప్పున మృతి చెందారు. కడప, ప్రకాశం, విజయనగరం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు మృతి చెందారు.
దేశంలో తాజాగా 53,370 కొత్త కరోనా కేసులు (Coronavirus Outbreak in India) నమోదు అయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 78,14,682 చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. అదే సమయంలో 650 మంది మరణించడంతో మరణాల సంఖ్య 1,17,956కు (Covid Deaths)చేరుకుందని ఆరోగ్య శాఖ పేర్కొంది. కాగా, దేశంలో 89.78 శాతం కరోనా రోగుల రికవరీ రేటు ఉండగా, మొత్తం కేసులలో యాక్టివ్ కేసుల శాతం 8.71 శాతం ఉంది.
దేశంలో మొత్తం నమోదయిన కేసులలో (COVID19 India) 1.51 శాతానికి మరణాల రేటు తగ్గింది. గడచిన 24 గంటలలో దేశవ్యాప్తంగా 12,69,479 కరోనా టెస్టులు నిర్వహించారు. ఇక ఇప్పటి వరకు నిర్వహించిన మొత్తం కరోనా టెస్ట్ ల సంఖ్య 10,13,82,564. దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసులు 6,80,680 ఉండగా, చికిత్స పొంది డిశ్చార్జ్ అయనవారి సంఖ్య 70,16,046గా ఉంది.