Coronavirus in India | (Photo Credits: PTI)

Amaravati, Nov 9: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 76,663నమూనాలు పరీక్షించగా 2,237 పాజిటివ్‌ కేసులు (AP Covid Report) నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8,42,967 కు చేరింది. కొత్తగా 12 మంది కరోనా బాధితులు మృతి చెందడంతో ఆ సంఖ్య 6,791కి (Covid Deaths) చేరింది. ఈ మేరకు ఆదివారం రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. ఇక గడిచిన 24 గంటల్లో 2,256మంది కోవిడ్‌ను జయించి డిశ్చార్జ్‌ అయ్యారు. ఇప్పటి వరకు 86,63,975మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 21,403యాక్టివ్‌ కేసులు (Andhra Pradesh Coronavirus) ఉన్నాయి.

గత 24 గంటల్లో.. కృష్ణా జిల్లాలో ముగ్గురు చనిపోగా.. చిత్తూరు, విశాఖపట్నంలలో ఇద్దరేసి చొప్పున, తూర్పుగోదావరి, గుంటూరు, నెల్లూరు, శ్రీకాకుళం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో మొత్తం 6,791 మంది చనిపోయారు. తూర్పుగోదావరి జిల్లాలో కొత్తగా 188 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. బాధితుల సంఖ్య 1,18,589కి చేరింది.

కుటుంబం మొత్తం సామూహిక ఆత్మహత్య, నంద్యాల ఘటనపై తక్షణం విచారణ జరపాల్సిందిగా డీజీపీ సవాంగ్‌కు ఏపీ సీఎం ఆదేశాలు, నంద్యాల వన్‌టౌన్‌ సీఐ సోమశేఖర్‌ సస్పెండ్‌

కాకినాడ సిటీ వైసీపీ అధ్యక్షుడు ఆర్‌వీజేఆర్‌ కుమార్‌ (ఫ్రూటీ కుమార్‌) కొవిడ్‌తో మృతిచెందారు. ఆయనకు గతంలో ఒకసారి వైరస్‌ సోకగా కాకినాడలోని ప్రైవేట్‌ ఆస్పత్రిల్లో చికిత్స పొంది కోలుకున్నారు. కానీ.. వైరస్‌ మరోసారి విజృంభించడంతో మెరుగైన చికిత్స కోసం ఆయనను విశాఖపట్నం తరలించారు. పరిస్థితి విషమించడంతో సోమవారం మృతిచెందారు.

కరోనా బారినపడి కోలుకున్న తర్వాత వచ్చే అనారోగ్య సమస్యలకు ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కింద చికిత్స చేయించుకునే వెసులుబాటు కల్పించింది.ఈ మేరకు ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. చికిత్స నిమిత్తం ప్రతిరోగికి రోజుకు రూ.2930 వరకూ అవకాశం కల్పించింది.