Amaravati, Mar 9: ఆంధ్రప్రదేశ్ లో గడచిన 24 గంటల్లో 45,079 కరోనా పరీక్షలు నిర్వహించగా 118 మందికి పాజిటివ్ (AP Covid Updates) అని నిర్ధారణ అయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 38 మందికి కరోనా సోకినట్టు వెల్లడైంది. కృష్ణా జిల్లాలో 21, విశాఖ జిల్లాలో 15 పాజిటివ్ కేసులు (Coronavirus Report in AP) నమోదయ్యాయి.
విజయనగరం జిల్లాలో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో 89 మంది కరోనా నుంచి కోలుకోగా, రాష్ట్రంలో ఎలాంటి మరణాలు సంభవించలేదు. రాష్ట్రంలో ఇప్పటివరకు 8,90,884 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,82,670 మంది కోలుకున్నారు. ఇంకా 1,038 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 7,176గా నమోదైంది.
భారత్‌లో గత 24 గంటల్లో 15,388 మందికి కరోనా నిర్ధారణ (India Coronavirus) అయింది. దేశంలో కొత్తగా నమోదైన కరోనా కేసుల వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం... 16,596 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,12,44,786కు చేరింది. గడచిన 24 గంటల సమయంలో 77 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,57,930కు (Covid Deaths) పెరిగింది.
దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,08,99,394 మంది కోలుకున్నారు. 1,87,462 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 22,27,16,796 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 7,48,525 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.