Representational Image (File Photo)

AP EAMCET Schedule 2024: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024 విద్యా సంవత్సారినికి సంబంధించి ఇంజినీరింగ్‌ సహా ఇతర కోర్సులు అభ్యసించేందుకు ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి బుధవారం విడుదల చేసింది. ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష AP EAPCETను మే 13 నుంచి 19వరకు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఏపీ ఈసెట్‌, ఐసెట్‌, ఎడ్‌సెట్‌ సహా మరో ఎనిమిది ప్రవేశ పరీక్షలకు తేదీలను ఖరారు చేసింది.

ఇక ఫిబ్రవరి 25న ఏపీలో గ్రూప్-2 నియామకాల ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్ష కోసం ఏపీపీఎస్సీ నేడు హాల్ టికెట్లను విడుదల చేసింది. హాల్ టికెట్లను https://psc.ap.gov.in/ వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చని ఏపీపీఎస్సీ వెల్లడించింది. 897 ఉద్యోగాలతో ఏపీ ప్రభుత్వం గ్రూప్-2 నోటిఫికేషన్ ప్రకటించడం తెలిసిందే.

డీఎస్సీ దరఖాస్తులు స్వీకరణ, ఈ నెల 22 వరకు గడువు, పూర్తి వివరాలు ఓ సారి తెలుసుకోండి

నోటిఫికేషన్ షెడ్యూల్ ప్రకారం... ఫిబ్రవరి 25న ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రిలిమ్స్ నిర్వహించనున్నారు. ఇందులో జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ ప్రశ్నలు ఉంటాయి. ఈసారి గ్రూప్-2 ఉద్యోగాలకు 4 లక్షల మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.

ఉమ్మడి ప్రవేశ పరీక్ష వివరాలు

ఏపీ ఈఏపీసెట్‌ - మే 13 నుంచి 19 వరకు - జేఎన్టీయూ కాకినాడ

ఈసెట్‌ - మే 8 - జేఎన్టీయూ, అనంతపురం

ఐసెట్‌ - మే 6- శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ, అనంతపురం

పీజీఈసెట్‌ - మే 29 నుంచి 31 వరకు - శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ, తిరుపతి

ఎడ్‌సెట్‌ - జూన్‌ 8 - ఆంధ్రా యూనివర్సిటీ, విశాఖపట్నం

లాసెట్‌ - జూన్‌ 9 - ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, గుంటూరు

పీఈసెట్‌ - తేదీ ఇంకా ప్రకటించాల్సి ఉంది- ఆచార్య నాగార్జున యూనివర్సిటీ

పీజీసెట్‌ - జూన్‌ 3 నుంచి 7 వరకు - ఆంధ్రా యూనివర్సిటీ, విశాఖ

ఏడీసెట్‌ (ఆర్ట్‌ అండ్‌డిజైన్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ -BFA/B.Design etc), జూన్‌ 13 - డా. వైఎస్సార్‌ ఆర్కిటెక్చర్‌ యూనివర్సిటీ, కడప