సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి ఘోర పరాభవం ఎదురయింది. 175 అసెంబ్లీ సీట్లకు 175 సీట్లు గెలుస్తామన్న వైఎస్ జగన్ అంచనాలు తలకిందులయ్యాయి. కనీసం రెండంకెల సీట్లను కూడా సాధించలేకపోయింది.
ఏపీలోని 26 జిల్లాల్లో 18 జిల్లాల్లో అయితే ఖాతా కూడా తెరవలేదు. ముఖ్యంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో క్లీన్‌స్వీప్ చేసిన విజయనగరం, నెల్లూరు జిల్లాల్లో ఈసారి వైసీపీ ఒక్క సీటు కూడా గెలవలేదు. వీటితో పాటు శ్రీకాకుళం, మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, , కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, శ్రీసత్యసాయి, నంద్యాల జిల్లాల్లో ఒక్క సీటు కూడా వైసీపీ గెలవలేదు. ఓటములు కొత్తేమీ కాదు, తట్టుకుని నిలబడి గెలిచాం, ఎన్నికల ఫలితాల అనంతరం వైఎస్ జగన్ భావోద్వేగం, ఇంకా ఏమన్నారంటే..
అల్లూరి సీతారామరాజు జిల్లాలో రెండు, తిరుపతిలో 1, చిత్తూరులో 1, అన్నమయ్యలో 2, కర్నూలులో 2 సీట్లు మాత్రమే గెలుచుకుంది. ఇక అసెంబ్లీ ఎన్నికలకు ముందు అభ్యర్థులను ప్రకటించే ముందు వైఎస్ జగన్ భారీ కసరత్తే చేశారు. దాదాపు 80కి పైగా సీట్లలో అభ్యర్థుల స్థానాలను మార్చారు. కానీ ఆ స్ట్రాటజీ ఏవీ వర్కవుట్ కాలేదు. అసెంబ్లీ స్థానాలు మార్చిన అందరూ ఓడిపోవడం గమనార్హం.
మొత్తం 13 ఉమ్మడి జిల్లాలకుగానూ 8 జిల్లాల్లో క్లీన్‌స్వీప్ చేసింది. ఈ ఎనిమిది జిల్లాల్లో 110 సీట్లు ఉండగా.. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 110 సీట్లలో విజయం సాధించింది. వైసీపీ ఉమ్మడి విశాఖ, ప్రకాశం, కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాలోని మొత్తం 10 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. ఉమ్మడి విశాఖలో 2, ఉమ్మడి ప్రకాశంలో ఒకటి, ఉమ్మడి కడప జిల్లాలో మూడు, కర్నూలు జిల్లాలో 2, చిత్తూరు జిల్లాలో 2 నియోజకవర్గాల్లో మాత్రమే వైసీపీ విజయం సాధించింది. ఓటమికి కారణాలను సమీక్షించుకుంటాం, ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై విజయసాయి రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
ఐదు జిల్లాల పరిధిలోని 65 నియోజకవర్గాలకు కేవలం 10 చోట్ల మాత్రమే వైసీపీ విజయం సాధించింది. మిగతా 55 నియోజకవర్గాల్లో టీడీపీ కూటమి విజయం సాధించింది.
శ్రీకాకుళం జిల్లాలో పది నియోజకవర్గాలకు 8 నియోజకవర్గాల్లో టీడీపీ పోటీచేయగా అన్ని స్థానాల్లో విజయం సాధించింది. బీజేపీ, జనసేన చెరో స్థానంలో పోటీచేయగా.. ఆ రెండు చోట్ల బీజేపీ, జనసేన అభ్యర్థులు విజయం సాధించారు.
విజయనగరం జిల్లాలో 9 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా టీడీపీ 8 స్థానాల్లో జనసేన ఒక చోట విజయం సాధించాయి.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 19 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా టీడీపీ 13, జనసేన ఐదు, బీజేపీ ఒక స్థానంలో విజయం సాధించాయి.
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 15 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా టీడీపీ 9, జనసేన 6 స్థానాల్లో పోటీచేయగా.. ఆ రెండు పార్టీలు పోటీచేసిన అన్ని స్థానాల్లో గెలుపొందారు.
ఉమ్మడి కృష్ణా జిల్లాలో 16 నియోజకవర్గాలు ఉండగా.. టీడీపీ 13, బీజేపీ 2, జనసేన ఒక స్థానంలో పోటీచేయగా.. ఆ మూడు పార్టీలు అన్ని స్థానాల్లో విజయం సాధించాయి.
ఉమ్మడి గుంటూరు జిల్లాలో మొత్తం 17 నియోజకవర్గాలు ఉండగా టీడీపీ 16, జనసేన ఒక నియోజకవర్గంలో పోటీచేయగా.. అన్ని స్థానాల్లో గెలుపొందాయి.
ఉమ్మడి అనంతపురం జిల్లాలో 14 నియోజకవర్గాలు ఉండగా.. టీడీపీ 13, బీజేపీ ఒకచోట విజయం సాధించాయి.
ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని 10 నియోజకవర్గాలు ఉండగా.. అన్ని చోట్ల టీడీపీ అభ్యర్థులు గెలుపొందారు.