Amaravati, May 29: ఏపీలో కరోనా కేసులు (AP COVID-19 Report) తగ్గుముఖం పడుతున్నాయి. ఏపీ కరోనా కేసుల తాజా బులెటిన్‌ను రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ విడుదల చేసింది. గత 24 గంటల్లో విదేశాల నుంచి వచ్చిన వారిని కలుపుకుని 33 మంది కోవిడ్ -19 పాజిటివ్‌గా తేలారు. 79 మంది కోవిడ్ నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు. కరోనా బారిన పడి కర్నూల్ జిల్లాలో ఒకరు చనిపోయారు. రాష్ట్రంలో నమోదైన మొత్తం 2874 కేసులలో (COVID 19 Cases) 2037మంది డిశ్చార్జ్ కాగా, 60 మంది మరణించారు. ప్రస్తుతం 777 మంది చికిత్స పొందుతున్నారు. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వం, నిమ్మగడ్డ కేసుపై న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపిన ఎమ్మెల్యే అంబటి రాంబాబు
రాష్ట్రంలో (Andhra Pradesh) కొత్తగా నమోదైన పాజిటివ్ కేసులలో చిత్తూర్‌లో నలుగురు, నెల్లూరులో ఇద్దరు.. తమిళనాడులోని కోయంబేడు నుంచి వచ్చారని అధికారులు తెలిపారు. గడిచిన 24 గంటల్లో 11638 కరోనా సాంపిల్స్ పరీక్షించగా.. 33 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. మరోవైపు దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 7,466 కరోనా కేసులు నమోదు కాగా, 175 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,65,799కి చేరింది.
Here's AP COVID-19 Report
Total positive cases: 2874
Discharged: 2037
Deceased: 60
Active cases: 777#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/wLyk1WT6Jv
— ArogyaAndhra (@ArogyaAndhra) May 29, 2020
కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల(స్టేట్ కోవిడ్ ఆసుపత్రి) నుంచి కరోనా అనుమానితురాలు పరార్ అయింది. విషయం తెలుసుకున్న అధికారులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో బస్సులో వెళ్తున్న ఆమెను అదుపులోకి తీసుకుని తిరిగి ఆసుపత్రికి తరలించారు. లాక్‌డౌన్‌ను మరో 15 రోజులు పొడిగించండి, కేంద్రాన్ని కోరిన గోవా సీఎం ప్రమోద్ సావంత్, మే 31తో నాలుగవ దశ లాక్‌డౌన్ క్లోజ్
ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి వచ్చే వారి పట్ల మరింత జాగ్రత్తగా ఉండాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది. ముఖ్యంగా మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ, తమిళనాడు, మధ్యప్రదేశ్, రాజస్తాన్ రాష్ట్రాల్లో కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉందని, అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చే వారికి వైద్య పరీక్షలు నిర్వహించాకే అనుమతించనున్నట్లు ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. ఈ మేరకు సవరించిన మార్గదర్శకాలను విడుదల చేశారు.
సవరించిన మార్గదర్శకాలను విడుదల
ఆరు రాష్ట్రాల నుంచి వచ్చే ప్రతి ఒక్కరికీ పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్షలు నెగిటివ్ అని తేలాక 7 రోజులు హోం క్వారంటైన్‌లో ఉండాలి. పాజిటివ్ అని తేలితే కోవిడ్ ఆస్పత్రులకు వెళ్లాలి. అలాగే హైరిస్క్ ప్రాంతాల నుంచి వచ్చిన అసింప్టమాటిక్ (లక్షణాలు కనిపించని) వారిని నిర్ధారణ చేశాక ఇన్‌స్టిట్యూషనల్ క్వారంటైన్‌లో ఉంచాలి. అసింప్టమాటిక్ వారు 14 రోజులు క్వారంటైన్‌లో ఉండాలి. అంతర్జాతీయ ప్రయాణికులకు సైతం ఇవే నిబంధనలు వర్తిస్తాయి. 60 ఏళ్లు దాటిన వారు, గర్భిణులు, 10 ఏళ్ల లోపు చిన్నారులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు నేరుగా ఇంటికి వెళ్లవచ్చు. విమానాలు, రైళ్లలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ప్రతి ఒక్కరికీ పరీక్షలు నిర్వహించేలా చర్యలు చేపట్టాలి. క్వారంటైన్‌లో ఉన్న వారిని ప్రతిరోజూ పోలీసులు, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు పర్యవేక్షిస్తారు.