 
                                                                 విశాఖలో జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ఘనంగా ప్రారంభమైంది. పారిశ్రామిక దిగ్గజాలు, 45కు పైగా దేశాల నుంచి ప్రతినిధులు సమ్మిట్‌కు హాజరయ్యారు.గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సులో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పాల్గొన్నారు. ఏపీకి పారిశ్రామిక వృద్ధిలో రోడ్ కనెక్టివిటీ కీలకమన్నారు. పోర్టులతో రహదారుల కనెక్టివిటీ బలోపేతం చేస్తామని మంత్రి తెలిపారు. పరిశ్రమలకు లాజిస్టిక్స్ ఖర్చు తగ్గించడం చాలా ముఖ్యమని, ఏపీలో 3 పారిశ్రామిక కారిడార్లు వస్తున్నాయన్నారు.ఏపీలో రోడ్ కనెక్టివిటీ పెంచేందుకు రూ. 20 వేల కోట్లు కేటాయించామని కేంద్ర మంత్రి గడ్కరీ తెలిపారు.
ఏపీలో మత్స్య పరిశ్రమ చాలా కీలకంగా మారిందని గడ్కరీ పేర్కొన్నారు. రాష్ట్రంలో మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్కుల ఏర్పాటుకు సిద్ధమని ప్రకటించారు. 50-50 భాగస్వామ్యంతో లాజిస్టిక్ పార్కులు ఏర్పాటు చేస్తామన్నారు. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ రంగంలో అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెప్పారు.
Here's AP CMO Video
గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సులో పాల్గొన్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. #AdvantageAP pic.twitter.com/4nqc894bBG
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) March 3, 2023
ఈ మార్కెట్ రోజురోజుకు విస్తరిస్తోందని వివరించారు. పర్యావరణహిత వాహనాలదే భవిష్యత్ అని స్పష్టంచేశారు. కాలుష్యాన్ని తగ్గించడం చాలా ముఖ్యమని సూచించారు. ఆటోమొబైల్ ఇండస్ట్రీకి రాయితీలు ఇస్తున్నట్లు గుర్తుచేశారు.కేంద్రం నుంచి ఏపీకీ సంపూర్ణ సహకారం ఉంటుందని గడ్కరీ చెప్పారు.
 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     QuickLY
                                                                                QuickLY
                                     Socially
                                                                                Socially
                                     
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     
                     
                     
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                
