ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కె.ఎస్ జవహర్ రెడ్డి నియామకమయ్యారు. కొత్త సీఎస్‌గా జవహర్ రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. డిసెంబర్ 1 నుంచి కొత్త ప్రధాన కార్యదర్శిగా ఆయన బాధ్యతలు నిర్వహిస్తారు.
2024 జూన్ వరకు ఆయన ఈ పోస్టులో కొనసాగుతారు. ప్రస్తుత ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఈనెల 30న పదవీ విరమణ చేయనున్నారు. దీంతో ఆయన స్థానంలో సీఎస్‌గా కె.ఎస్ జవహర్ రెడ్డిని ఎంపిక చేసింది ప్రభుత్వం. ముందుగా సీఎస్ రేసులో పలువురి పేర్లు తెరపైకి వచ్చినా.. జవహర్‌రెడ్డివైపే మొగ్గు చూపింది.1990 బ్యాచ్‌కి చెందిన ఐఏఎస్ జవహర్‌రెడ్డి.. ప్రస్తుతం సీఎంకు ప్రత్యేక కార్యదర్శిగా కొనసాగుతున్నారు.
నగరి క్రీడా సంబరాల్లో అనుకోని ఘటన.. కబడ్డీ ఆడుతూ కిందపడ్డ మంత్రి రోజా.. వీడియో ఇదిగో!
జవహార్ సీఎస్‌గా ఉన్న సమయంలో 2024లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఏపీ నూతన సీఎస్ ఎంపిక సమయంలో సీనియారిటీ జాబితాలో 1987వ బ్యాచ్‌కు చెందిన నీరభ్ కుమార్ ప్రసాద్, 1988 బ్యాచ్‌కు చెందిన పూనం మాలకొండయ్య, 1989 బ్యాచ్‌కు చెందిన కరికాల్ వలెవన్‌తో పాటు, 1988 బ్యాచ్‌కు చెందిన గిరిధర్ అరమనే(ఏపీ క్యాడర్- ప్రస్తుతం కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శిగా ఉన్నారు) పేర్లు కూడా గట్టిగానే వినిపించాయి.
గిరిధర్ శనివారం జగన్‌ను కలవడంతో.. ఆయన కూడా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రేసులో ఉండవచ్చనే ఊహాగానాలు వెలువడ్డాయి. కానీ సీఎం జగన్ మాత్రం జవహర్ రెడ్డిని సీఎస్‌గా నియమించేందుకు మొగ్గు చూపారు.