AP Budget: మూడు నెలల బడ్జెట్‌కు గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్‌ ఆమోదం, గవర్నర్ ఆమోదంతో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ, ఎన్నికల తర్వాతనే పూర్తి స్థాయి బడ్జెట్
AP Governor Biswabhusan Harichandan and CM YS jagan (Photo-Twitter)

Amaravati, mar 28: ఏపీ బడ్జెట్ ఆర్డినెన్స్‌ను గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్‌ ఆమోదించారు. మూడు నెలల ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు ఆర్డినెన్స్‌ జారీ అయ్యింది. గవర్నర్ ఆమోదంతో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2021 ఏడాది బడ్జెట్‌కు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టనుంది.

ఇందుకు సంబంధించిన ఆర్డినెన్స్‌కు రాష్ట్ర కేబినెట్‌ శుక్రవారం ఆమోదం తెలిపిన సంగతి విదితమే. మూడు నెలల కాలానికి గాను కేబినెట్‌ దీనిని ఆమోదించింది. అనంతరం ఈ ఆర్డినెన్స్‌ను గవర్నర్‌కు పంపించడంతో ఆయన ఆమోద ముద్ర వేశారు.

ఉద్యోగుల జీతభత్యాలు, సంక్షేమ కార్యక్రమాల అమలుకు నిధుల కేటాయిస్తారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు పూర్తయిన తర్వాతనే పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు 3 నెలలకు బడ్జెట్ ఆర్డినెన్స్‌ ప్రభుత్వం తీసుకొచ్చింది.

మూడు జిల్లాల్లో కరోనా కల్లోలం, ఏపీలో తాజాగా 947 మందికి కరోనా నిర్థారణ, నేటి వరకు రాష్ట్రంలో 1,49, 58,897 మందికి కరోనా టెస్టులు, రాష్ట్రంలో 4,715 యాక్టివ్ కేసులు

2021-22 ఆర్థిక సంవత్సరం తొలి మూడు నెలలకు రూ.90వేల కోట్ల పద్దుల కోసం రూపొందించిన ఆర్డినెన్సుకు మంత్రిమండలి శుక్రవారం ఆమోదం తెలిపింది. అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి... పూర్తిస్థాయి బడ్జెట్‌ ప్రవేశపెట్టి, సభామోదం పొందే అవకాశం ఉన్నప్పటికీ, ‘పరిషత్‌’ ఎన్నికల నిర్వహణ కోసం ఎదురు చూస్తూ, ఓటాన్‌ అకౌంట్‌ వైపే సర్కారు మొగ్గు చూపింది.