AP Govt to file court case against Pawan Kalyan: ఏపీ వలంటీర్లపై దురద్దేశపూర్వకంగా జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై కోర్టుకు వెళ్లాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు స్పెషల్ సీఎస్‌అజయ్ జైన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఏలూరులో ఈ నెల 9న వలంటీర్లపై పవన్ నిరాధార ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. మహిళల అక్రమ రవాణా చేస్తున్నారంటూ పవన్ వ్యాఖ్యానించారు.
పవన్ కల్యాణ్‌కు ఏపీ మహిళా కమిషన్ షాక్, మహిళలకు క్షమాపణ చెప్పాలని నోటీసులు..
దీనిపై 1973 క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. వలంటీర్లపై తప్పుడు ఆరోపణలు చేసినందుకు సంబంధింత కోర్టులో పరువు నష్టం కేసు దాఖలు చేయాలని పీపీకి ఆదేశాలు జారీ చేసింది. వలంటీర్లలోని మహిళలను కించపరిచేలా.. అవమానకరమైన, విషపూరిత వ్యాఖ్యలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది.
Here's Pawan Video
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ని ప్రాసిక్యూట్ చేయమని ఇచ్చిన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం.
సరే సై అంటూ తేల్చుకుందాం అన్న పవన్ కళ్యాణ్. pic.twitter.com/Np5mveCrvu
— Telugu Scribe (@TeluguScribe) July 20, 2023
గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థపై పవన్ వ్యాఖ్యలు పరువు నష్టం కలిగించేలా ఉన్నాయని వలంటీర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో ఆత్మీయులకు స్వచ్ఛందంగా సేవలందించే వలంటీర్లను పవన్ సంఘ విద్రోహ శక్తులతో పోల్చటంపై నిరసన జ్వాలలు భగ్గుమన్నాయి.
ఇదిలా ఉంటే కోర్టులోనే తేల్చుకుందామంటూ పవన్ కళ్యాణ్ సవాల్ విసిరారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ని ప్రాసిక్యూట్ చేయమని ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులపై జనసేనాధినేత సై అన్నారు. అక్కడే తేల్చుకుందామన్నారు.