HIGH COURT OF ANDHRA PRADESH| (Photo-Twitter)

Amaravati, Oct 12: ఇటీవల సోషల్ మీడియాలో న్యాయమూర్తులపై అవాంఛనీయ రీతిలో వ్యాఖ్యలు (Slandering Posts on Judges) చేస్తున్నారంటూ ఏపీ హైకోర్టు (AP High Court) అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో సామాజిక మాధ్యమాల్లో న్యాయమూర్తులను దూషించిన కేసును సీబీఐకి (CBI) అప్పగిస్తూ ఏపీ హైకోర్టు సంచలన ఆదేశాలిచ్చింది. 8 వారాల్లోగా నివేదిక అందజేయాలని ఆదేశించింది. సామాజిక మాధ్యమాలలో ఇటీవల జడ్జీలను దూషించిన వారిపై కూడా.. ఎఫ్‌ఐఆర్‌ (FIR) నమోదు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. అలాగే సీబీఐకి సహకరించాలని ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది.

సామాజిక మాధ్యమాల్లో ఇటీవల కూడా జడ్జిలపై ( judges) వ్యాఖ్యలు చేసినవారిపైనా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని స్పష్టం చేసింది. ముఖ్యంగా, ఈ దర్యాప్తులో సీబీఐకి సహకరించాలంటూ ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. న్యాయ వ్యవస్థలపైనా, న్యాయమూర్తులపైనా సోషల్ మీడియాలో పోస్టులు పెరిగిపోతుండడాన్ని హైకోర్టు తీవ్రంగా పరిగణిస్తోంది.

ఏపీ సీఎం వైయస్ జగన్ లేఖలో ఏముంది? న్యాయవ్యవస్థపై చర్చ మరోసారి తెరపైకి, ట్విట్టర్ వేదికగా స్పందిస్తున్న పలువురు ప్రముఖులు, సీజేఐ ఎస్‌ఎ బాబ్డే ఏం నిర్ణయం తీసుకుంటారనే దానిపై సర్వత్రా ఆసక్తి

ఇటీవల కొన్ని ప్రభుత్వ వ్యతిరేక తీర్పులు వచ్చిన నేపథ్యంలో జడ్జిల పట్ల అవమానకర రీతిలో పోస్టులు పెడుతున్నారంటూ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటీవల స్పీకర్ తమ్మినేని సీతారాం చేసిన వ్యాఖ్యలపైనా న్యాయస్థానం దృష్టి సారించింది. స్పీకర్ న్యాయవ్యవస్థలపై చేసిన వ్యాఖ్యలను ప్రత్యేకంగా పరిగణించి విచారించక తప్పదని హెచ్చరించింది.

ఏపీ హైకోర్టు కొన్ని నెలలుగా ఇచ్చిన తీర్పులకు వ్యతిరేకంగా సోషల్‌ మీడియాలో కొందరు తీవ్రమైన వ్యాఖ్యలతో పోస్టులు పెట్టారు. వీటిపై లక్ష్మీనారాయణ అనే న్యాయవాది ఓ పిటిషన్‌ దాఖలు చేయగా... ఆ తర్వాత హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ ఫిర్యాదు ఆధారంగా హైకోర్టు మరో సుమోటో కేసు నమోదు చేసింది. వీటి విచారణ సందర్భంగా హైకోర్టు ఏపీ సీఐడీకి బాధ్యులపై కేసులు నమోదు చేయాలని ఆదేశాలు ఇచ్చింది.

న్యాయవ్యవస్థతో ఏపీ ప్రభుత్వం ఢీ, ఏపీ హైకోర్టు జడ్జీల తీర్పుల తీరుపై సీజేఐకి లేఖ రాసిన ఏపీ సీఎం వైయస్ జగన్, మీడియా సమావేశంలో కీలక విషయాలను వెల్లడించిన ఏపీ ప్రభుత్వ సలహాదారు అజేయ కల్లం

అయితే మొత్తం 98 మందికి నోటీసులు జారీ చేసినా కేవలం 18మందిపైనే అదీ నాన్‌ బెయిలబుల్‌ కేసులు పెట్టారంటూ తాజాగా కర్నూలుకు చెందిన మాజీ పోలీసు అధికారి శివానందరెడ్డి మరో పిటిషన్‌ వేశారు. అంతటితో ఆగకుండా వైసీపీ సోషల్‌ మీడియా టీమ్‌ వీటి వెనుక ఉందని పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు సీబీఐ దర్యాప్తుకు ఆదేశాలు ఇచ్చింది.

ఇదిలా ఉంటే రాజధాని అమరావతి (Amaravati) పై విచారణ మరోసారి వాయిదా పడింది. నవంబర్ 2 వతేదీకు విచారణను వాయిదా వేస్తు ఏపీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్బంగా పలు అంశాలు చర్చకొచ్చాయి. ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానుల అంశాన్ని (Ap Three Capitals) సవాలు చేస్తూ దాఖలైన పిటీషన్లపై ఏపీ హైకోర్టు (Ap High court) లో విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. విచారణలో భాగంగా రాజధాని తరలింపుపై కోర్టు స్టే ఇచ్చింది. ఇందులో భాగంగా మధ్యంతర ఉత్తర్వుల కోసం దాఖలైన అంతర్గత పిటీషన్ పై విచారణ హైకోర్టులో పూర్తయింది. తదుపరి విచారణను నవంబర్ 2 కు వాయిదా వేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది.