Coronavirus Screening | (Photo Credits: AFP)

Amaravati, April 3: ఏపీలో గత 24 గంటల్లో 31,260 కరోనా పరీక్షలు నిర్వహించగా, 1,398 మందికి పాజిటివ్‌గా నిర్థారణ (COVID-19 positive cases) అయ్యింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 9,05,946 మందికి కరోనా వైరస్‌ సోకింది. గడచిన 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని 787 మంది క్షేమంగా డిశ్చార్జ్‌ కాగా, ఇప్పటివరకు 8,89,295 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.

గత 24 గంటల్లో కరోనా బారినపడి గుంటూరులో ఇద్దరు, నెల్లూరులో ఇద్దరు.. చిత్తూరు, వైఎస్సార్‌ కడప, కర్నూలు, ప్రకాశం, విశాఖపట్నంలో ఒక్కొక్కరు చొప్పున మొత్తం 9 మంది (Covid Deaths) మరణించగా, ఇప్పటివరకు 7,234 మంది మృతిచెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 9417 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. నేటివరకు రాష్ట్రంలో 1,51,77,364 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు.

పాడేరు శ్రీకృష్ణాపురం ప్రభుత్వ గిరిజన సంక్షేమ పాఠశాలలో కరోనా కల్లోలం సృష్టించింది. ఇటీవల శుభకార్యానికి వెళ్లిన పాఠశాల ఎల్.ఎఫ్.ఎల్ హెచ్.ఎంకు కరోనా పాజిటివ్ ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. వెంటనే అధికారులు అప్రమత్తమైయ్యారు. ఐసోలేషన్లో కుటుంబ సభ్యులు, ఆశ్రమ పాఠశాలలో బోధన, బోధనేతర సిబ్బందితో పాటు 40 మందికి కోవిడ్ పరీక్షలు చేశారు.

ఢిల్లీలో మూడు దాటి 4వ దశలోకి చేరిన కరోనా, మీకు దండం పెడతాను.. దయచేసి మాస్క్‌ ధరించండని వేడుకుంటున్న సీఎం కేజ్రీవాల్, లాక్‌డౌన్‌ లేదు, జాగ్రత్తలు పాటించాలని సీఎం సూచన

గుంటూరు జిల్లా తెనాలిలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌లో ఏడుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ముగ్గురు ఎస్ఐలు, ఇద్దరు హెడ్ కానిస్టేబుల్స్, ఇద్దరు కానిస్టేబుల్స్‌కు పాజిటివ్ అని తేలింది. దీంతో మిగిలిన సిబ్బంది సైతం ఆందోళన చెందుతున్నారు.