AP CM YS Jagan Mohan Reddy Launched COVID-19 Vaccination Program (Photo-Twitter)

Amaravati, June 19: రాష్ట్రంలో గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 1,03,935 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 5,674 మందికి కరోనా పాజిటివ్‌గా (AP logs 6,617 new COVID-19 cases) నిర్థారణ అయ్యింది. నిన్న ఒక్కరోజే కరోనా బారిన పడి 45 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 12,269 కు (Covid Deaths) చేరింది. గడిచిన 24 గంటల్లో 8,014 మంది కోవిడ్‌ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్‌ అవ్వగా, ఇప్పటివరకు 17 లక్షల 67 వేల 404 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.

ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బుధవారం కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. ఏపీలో ప్రస్తుతం 65,244 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో నేటి వరకు 2,10,50,846 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రంలో కోవిడ్‌ వ్యాక్సినేషన్ (Covid Vaccination) స్పెషల్ డ్రైవ్‌ను ఏపీ పభుత్వం ఆదివారం నిర్వహించనుంది. రేపు ఒక్కరోజే 8 ల‌క్ష‌ల కరోనా వైరస్‌ వ్యాక్సిన్ వేసేలా లక్ష్యం పెట్టుకుంది.

హైదరాబాద్‌లో డబుల్ డోస్ వ్యాక్సిన్ కలకలం, ఫోన్ మాట్లాడుతూ యువతికి ఓకేసారి డబుల్‌ డోస్‌ వ్యాక్సిన్‌ ఇచ్చిన నర్స్‌, వాక్సిన్ అనంతరం కళ్లు తిరిగి పడిపోయిన యువతి, ఇప్పుడు నిలకడగా పరిస్థితి

ఈ మేరకు అన్ని జిల్లాల్ల క‌లెక్ట‌ర్ల‌కు వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఐదేళ్లలోపు పిల్లల తల్లులకు కూడా ప్రత్యేకంగా వ్యాక్సినేషన్ అందించాలని తెలిపింది. ఇప్పటికే ఒక్కరోజులోనే 6 లక్షల వ్యాక్సిన్లు వేసి ఏపీ చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే.

ఇప్పటివరకు కోటి 22లక్షల 83వేల 479 వ్యాక్సిన్‌ డోసులను ప్రభుత్వం ప్రజలకు అందించింది. ఇప్పటివరకు 5లక్షల 29వేల మంది ఐదేళ్లలోపు పిల్లల తల్లులకు తొలి డోస్‌ వ్యాక్సిన్‌ వేశారు. వ్యాక్సినేషన్‌ ప్రారంభం నుంచి ఇప్పటి వ‌ర‌కు రెండు సార్లు ఒక్క‌రోజులో 6 ల‌క్ష‌ల కరోనా వాక్సిన్‌ డోస్‌లను వైద్య ఆరోగ్యశాఖ‌ అందించింది. ఇప్పటివరకు 26,41,739 మందికి ప్రభుత్వం రెండు డోసుల టీకాను వేసింది.