AP Municipal Elections 2021: మళ్లీ వైసీపీదే హవా..మునిసిపల్ ఎన్నికల్లో ఏకగ్రీవాల జోరు, మొత్తం 245 డివిజన్, వార్డు స్థానాల్లో సింగిల్ నామినేషన్లు దాఖలు, మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఎస్ఈసీ అధికారికంగా ప్రకటించే అవకాశం
Telangana Civic Polls 2020 | (Photo-PTI)

Amaravati, Mar 3: ఆంధ్రప్రదేశ్‌లో మార్చి 10న మునిసిపల్ ఎన్నికలు (AP Municipal Elections 2021) జరగనున్నాయి. ఇప్పటికే పలు జిల్లాల్లో నామినేషన్లు దాఖలు కాగా, నామినేషన్ల తొలి రోజు అయిన నిన్న కడప, చిత్తూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పెద్ద సంఖ్యలో నామినేషన్లు ఉపసంహరించుకున్నారనే వార్తలు వస్తున్నాయి.

మొత్తం 245 డివిజన్, వార్డు స్థానాల్లో సింగిల్ నామినేషన్లే మిగిలాయని తెలుస్తోంది. దీంతో ఇవన్నీ ఏకగ్రీవమైనట్టేనని (unanimous in ap) సమాచారం. ఈ డివిజన్ వార్డు స్థానాల్లో మొత్తం 221 చోట్ల వైసీపీ ((YSRCP) అభ్యర్థులే ఉండడం గమనార్హం. అయితే, నామినేషన్ల ఉపసంహరణ గడువు నేటి మధ్యాహ్నం 3 గంటల వరకు ఉండడంతో ఎస్ఈసీ ఆ తర్వాత ఏకగ్రీవమైన అభ్యర్థులను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

కడప జిల్లాలో అత్యధికంగా 100 డివిజన్ లు ఏకగ్రీవమయ్యాయి. వీటిలో పులివెందుల మునిసిపాలిటీలో మొత్తం 33 వార్డులలోను ఒక్కటి చొప్పున నామినేషన్లు మిగిలాయి. ఇక, చిత్తూరులో 37, కర్నూలులో 36, అనంతపురం జిల్లాలో 13 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. వైఎస్సార్, చిత్తూరు, అనంతపురం, గుంటూరు జిల్లాల్లో అత్యధికంగా వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికవ్వనున్నట్లు సమాచారం.

వాలంటీర్లు ఫోన్ల వాడకం పిటిషన్‌పై తీర్పును రిజర్వులో ఉంచిన హైకోర్టు, ఎస్‌ఈసీ ఆదేశాలు ఏకపక్షంగా ఉన్నాయంటూ కోర్టు గడప తొక్కిన ఏపీ ప్రభుత్వం, పురపాలక ఎన్నికలపై పిల్‌ కొట్టివేత

అలాగే నెల్లూరు జిల్లాలో 11 డివిజన్, వార్డు సభ్యుల స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు ఏకగ్రీవం కానున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో సింగిల్ డిజిట్‌లోనే ఏక్రగీవాలు అయ్యాయి. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులోని ఒక వార్డులో టీడీపీ (TDP) అభ్యర్థి ఏకగ్రీవం కానున్నారు. చిత్తూరు జిల్లా పుంగనూరు మున్సిపాలిటీలోని 16 వార్డుల్లో సింగిల్‌ నామినేషన్లు దాఖలయ్యాయి. గుంటూరు జిల్లాలో 2 మున్సిపాలిటీల్లో అత్యధిక వార్డులు ఏకగ్రీవం అయ్యే అవకావాలు ఉన్నాయి.

మున్సిపల్‌ ఎన్నికల్లో 2,472 మంది అభ్యర్థులు మంగళవారం తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ఉపసంహరణకు మంగళవారం, బుధవారం అవకాశం ఇవ్వగా.. 12 నగరపాలక సంస్థలు, 75 పురపాలక సంఘాలు/నగర పంచాయతీల్లో తొలి రోజు నామినేషన్లు ఉపసంహరించుకున్న వారిలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు 1,070 మంది, టీడీపీ అభ్యర్థులు 738 మంది, జనసేన అభ్యర్థులు 76 మంది, బీజేపీ అభ్యర్థులు 77 మంది, సీపీఎం అభ్యర్థులు 34 మంది, సీపీఐ అభ్యర్థులు 18 మంది ఉండగా.. మిగిలిన వారు ఇండిపెండెంట్లుగా ఉన్నారు.