Amaravati, Feb 13: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి గుంటూరు జిల్లా రొంపిచర్ల మార్కెట్ యార్డ్ చైర్మన్ అంజయ్య (Rompicharla market yard chairman Anjayya) పంపిన సెల్ఫీ వీడియో కలకలం రేపుతోంది. నరసరావుపేట టూటౌన్ సీఐ కృష్ణయ్య తుపాకీ పెట్టి చంపుతానని బెదిరించాడని ఆరోపిస్తూ సీఎం జగన్‌కు రొంపిచెర్ల మార్కెట్ యార్డు ఛైర్మన్ అంజయ్య ఈ సెల్ఫీ వీడియో (elfie video to AP CM ys jagan) ద్వారా ఫిర్యాదు చేశారు.
పంచాయితీ ఎన్నికల్లో (AP Local Body Elections) టీడీపీకి పనిచేసిన వ్యక్తిని ఎమ్మెల్యే గోపిరెడ్డి గోగులపాడు సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టారని, దీంతో తొలి నుంచి వైసీపీలోనే ఉన్న తాము కూడా పోటీకి దిగానని ఈ వీడియోలో పేర్కొన్నారు.ఇది జీర్ణించుకోలేని ఎమ్మెల్యే సీఐ కృష్ణయ్యతో కలిసి వేధిస్తున్నారని ఆ వీడియోలో ఆరోపించారు.
సీఐ తనకు తుపాకి గురిపెట్టి పోటీ నుంచి తప్పుకోవాలని బెదిరించారని వాపోయారు. ఎమ్మెల్యే గోపిరెడ్డి, సీఐ కృష్ణయ్య నుంచి తనను, తన కుటుంబాన్ని కాపాడాలని అంజయ్య ఆ వీడియోలో వేడుకున్నారు. ఎమ్మెల్యే గోపిరెడ్డి, సీఐ కృష్ణయ్య నుంచి తమ కుటుంబాన్ని కాపాడాలని వేడుకుంటూ అంజయ్య వీడియోలో సీఎం జగన్‌ను వేడుకున్నారు. ఇప్పుడీ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
His wife Statement
గుంటూరు. రొంపిచర్ల పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత
రొంపిచర్ల మార్కెట్ యార్డు చైర్మన్ ధావులూరి అంజయ్యని అరెస్ట్ చేసిన పోలీసులు
గోగులపాడు వైసీపీ సర్పంచ్ రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అంజయ్య మేనల్లుడు లక్ష్మీ నారాయణ pic.twitter.com/8FZQXoChhK
— తెలుగుదేశంసైనికులు (@TDPMission2024) February 13, 2021
ఇదిలా ఉంటే గోగులపాడు వైసీపీ సర్పంచ్ రెబల్ అభ్యర్థిగా అంజయ్య పోటీ చేస్తున్నారు. కాగా అంజయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిర్దేశిత సమయం ముగిసినా అంజయ్య ప్రచారం చేయడంతోనే ఆయనను అదుపులోకి తీసుకున్నట్టు రొంపిచర్ల పోలీసులు చెబుతుండగా, మేనల్లుడు లక్ష్మీనారాయణ రాజకీయంగా ఒత్తిడి తీసుకురావడంతోనే సీఐ కృష్ణయ్య తన భర్తను తీసుకెళ్లారని అంజయ్య భార్య ఆరోపించారు.ఈ క్రమంలోనే అంజయ్య సెల్ఫీ వీడియో వైరల్‌గా మారింది.