AP Coronavirus: ఒక్కరోజే కరోనాతో 18 మంది మృతి, ఏపీని వణికిస్తున్న ఆ నాలుగు జిల్లాలు, తాజాగా 4,157 మందికి కోవిడ్ నిర్ధారణ, ప్రస్తుతం రాష్ట్రంలో 28,383 యాక్టివ్ కేసులు
Coronavirus in India (Photo Credits: PTI)

Amaravati, April 14: ఏపీలో గత 24 గంటల్లో 35,732 మందికి కోవిడ్ టెస్టులు నిర్వహించగా 4,157 మందికి పాజిటివ్ గా నిర్ధారణ (AP Coronavirus) అయింది. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 617 కేసులు నమోదు కాగా.. పశ్చిమ గోదావరి గోదావరి జిల్లాలో అత్యల్పంగా 60 కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 18 మంది కరోనా వల్ల మృతి చెందారు.

అలాగే, 1,606 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజా గణాంకాలతో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 9,37,049కి పెరిగింది. మరణాల సంఖ్య 7,339కి (Covid Deaths in AP) చేరుకుంది. ఇప్పటి వరకు 9,01,327 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 28,383 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కరోనా పాజిటివ్‌ బారిన పడ్డారు. హైదరాబాద్‌లోని కాంటినెంటల్‌ ఆస్పత్రిలో అత్యవసర విభాగంలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. తనకు వైరస్‌ సోకినా ఎమ్మెల్యే అశ్రద్ధ చేయడంతో ఊపిరితిత్తుల సమస్య తీవ్రమైంది. దీంతో శ్రీదేవిని ఆసుపత్రిలో చేర్పించారు. శ్రీదేవి ఆరోగ్యంపై ఏపీ సీఎంవో నుంచి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారు.

తెలంగాణలో యువతను కాటేస్తోన్న కరోనా, రాష్ట్రం కేసుల్లో మరో మహారాష్ట్రగా మారే ప్రమాదం, మొదటి వేవ్‌ కన్నా రెండవ్ వేవ్ కేసులు ఎక్కువని తెలిపిన మంత్రి ఈటెల రాజేందర్, సరిహద్దుల్లో పలు ఆంక్షలు

24 గంటల్లో నమోదైన 4157 కేసుల్ని పరిశీలిస్తే తూర్పుగోదావరిలో అత్యధికంగా 617 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత స్ధానాల్లో శ్రీకాకుళం 522, చిత్తూరు 517, గుంటూరు 434, విశాఖ 417, కర్నూలు 386 వచ్చాయి. 300 కంటే తక్కువ కేసులున్న జిల్లాల్లో అనంతపురం 297, నెల్లూరు 276, ప్రకాశం 230, విజయనగరం 154, కృష్ణా 135, కడప 112, పశ్చిమగోదావరి 60 కేసులు వచ్చాయి. గత వారం రోజుల్లో నాలుగు జిల్లాల్లోని తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరులో అత్యధికంగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం ఆ నాలుగు జిల్లాల్లోనే యాక్టివ్ కేసుల సంఖ్య కూడా అధికంగా ఉంది.

కరోనాని కంట్రోల్ చేయలేకపోతున్న లాక్‌డౌన్, నైట్ కర్ప్యూలు, దేశంలో 24 గంట‌ల్లో ఏకంగా 1,84,372 కేసులు న‌మోద‌ు, 1027 మంది మృతితో 1,72,085కు చేరుకున్న మరణాల సంఖ్య

ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో రాష్ట్రంలోనే అత్యధికంగా 4,947 యాక్టివ్ కేసులున్నాయి. గుంటూరు జిల్లాలో 3,246, విశాఖపట్నం జిల్లాలో 3,043, కృష్ణాజిల్లాలో 2,876 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటికే గుంటూరు జిల్లాలోని పలు మండలాల్లో లాక్ డౌన్ విధించారు. ఒక్క తిరుపతి నగరంలోనే రోజుకు 300పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇక్కడ ఎన్నికలు లేకుంటే కేసులు అత్యధికంగా ఉన్న ప్రాంతాల్లో కఠిన ఆంక్షలు విధించాల్సిన పరిస్థితి .విశాఖపట్నంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. విశాఖనగరంలోనే అత్యధిక పాజిటివ్ కేసులు వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది.